అమరావతి : టీడీపీ ప్రతిదీ అడ్వాంటేజ్ తీసుకుంటోందా ?
ప్రతిపక్షమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ అవకావాన్ని వదులుకోదని అందరికీ తెలిసిందే. అందులోను తెలుగుదేశంపార్టీ లాంటి పార్టీ అస్సలు వదులుకోదు. ఎల్లోమీడియానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. ఎల్లోమీడియా చేస్తున్న పోరాటమే చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలు కాపాడటం కోసం. అలాంటిది మీడియాలో 90 శాతం మద్దతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వదిలిపెడతారా ? విజయవాడలో జరిగిన అత్యాచారం+ఘటన తర్వాత జరిగిన గొడవే తాజా ఉదాహరణ.
మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పదమ్మకు చంద్రబాబుకు మధ్య పెద్ద గొడవే జరిగింది. చంద్రబాబు కోసమని బోండా ఉమ అండ్ కో పద్మపై రెచ్చిపోయారు. దాంతో కమీషన్ చంద్రబాబు, బోండాకు నోటీసులిచ్చింది. ఈనెల 27వ తేదీ కమీషన్ ముందు హాజరుకావాలంటు నోటీసులిచ్చింది. కమీషన్ ముందు చంద్రబాబు హాజరవుతారా లేదా అన్నది చూడాలి. కానీ ఈ నేపంతో రెండు రోజులుగా ఎల్లోమీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత గందరగోళం చేస్తోందో అందరు చూస్తున్నదే.
ప్రభుత్వంపై బురదచల్లేందుకు చంద్రబాబు, ఎల్లోమీడియా అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరన్న విషయం గమనించాలి. అవకాశం ఇవ్వటం ప్రభుత్వం తప్పు అంతేకానీ తీసుకోవటం వాళ్ళ తప్పు కానేకాదు. ఇప్పుడే ఇలాగుంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రచారాన్ని ఎల్లోమీడియా ముందు ముందు మరింత పెంచేయటం ఖాయం. జగన్ను ఎంత బద్నాం చేస్తే జనాలు ప్రభుత్వానికి అంతగా దూరమవుతారని, టీడీపీ వైపుకు వస్తారని చంద్రబాబు, ఎల్లోమీడియా బలంగా నమ్ముతున్నారు. అందుకనే నెగిటివ్ ప్రచారం మీదే వీళ్ళు ఆధారపడున్నారు.
ఈనెల 27వ తేదీన కమీషన్ ముందు చంద్రబాబు అండ్ కో హాజరవ్వాలట. హాజరైతే ఏమి చేస్తారు ? హాజరుకాకపోతే ఏమి చేయగలరు ? ఇక్కడ సమస్య ఏమిటంటే చంద్రబాబుకు ముందో లేకపోతే తర్వాతో పద్మ బాధితురాలిని పరామర్శించుంటే ఈ గొడవే ఉండేదికాదు కదా. చంద్రబాబు అక్కడకు చేరగానే పద్మ వెళ్ళిపోయుంటే గొడవ ఉండేదేకాదు. బాధితులను పరామర్శించేటపుడు అధికారంలో ఉన్నవారు కాస్త సంయమనం పాటించాలి. అలాకాకుండా ప్రతిపక్షాల్లాగే అధికారపక్షం కూడా ఆవేశపడితే ఉపయోగం ఏముంటుంది ? బాధితురాలిపై అత్యాచారం ఒక సమస్య అయితే తర్వాత జరిగిన గొడవ మరో సమస్యగా మారిపోయిందిపుడు.