భారీగా పెరగనున్న ఆయిల్ ధరలు... సామాన్యులకు ఇక్కట్లు తప్పవా?

VAMSI
మన ప్రపంచంలో కెల్లా అధికంగా పామాయిల్ ను ఉత్పత్తి చేసే దేశం ఇండోనేసియా. అటువంటి దేశంలో కూడా ఇప్పుడు పామాయిల్ కు సంక్షోభం ఏర్పడింది. అంతే కాదు ద్రవ్యోల్బణం ప్రకారం ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయిల్ కొనాలి అంటే ఇప్పుడు ప్రజలకు బంగారం కొంటున్న ఫీలింగ్స్ వస్తున్నాయి. ఒక్కసారిగా అంతలా పెరిగిపోయాయి. మరి ఇంతలా పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి ఇక అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వంట నూనె, అలాగే దాని ముడి పదార్థాల యొక్క ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశ అధ్యక్షుడు జోకో విడోడో తాజాగా ప్రకటించారు. ఇది రానున్న ఏప్రిల్ 28 నుంచి ఇది అమల్లోకి రానుంది.

కాగా దీని ముఖ్య ఉద్దేశం ఇంట్లోని ఆహార ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యం అని జోకో విడోడో అన్నారు. అలాగే దేశీయ విపణిలో వంటనూనెలు  సమృద్ధిగా , అంతే కాకుండా అందరికి అందుబాటు ధరలో ఉండేలా చూస్తాం అని కూడా స్పష్టం చేశారు. ఇక దాని కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక  ఆదేశం పామాయిల్ యొక్క ఎగుమతులను నిలిపివేయడం వలన.. దాని ప్రభావం మన దేశం పైన కూడా తీవ్రంగా పడుతుంది. ఎందుకుంటే మన దేశమే పెద్ద మొత్తంలో ఇండోనేసియా నుండి ఆయిల్‌ను దిగుమతి చేస్తుంది. కాగా ఏప్రిల్ 28 నుంచి భారత్‌కు ఆ నూనె రాదు. ఇక అప్పుడు పామాయిల్ కొరత ఏర్పడటంతో .. దాని ధరలు కూడా  భారీగా పెరిగే అవకాశము లేకపోలేదు. .

ఇక వంట నూనెల విషయానికి వచ్చినట్లైతే మనదేశం ఎక్కువగా దిగుమతుల పైనే ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ప్రతి ఏటా 13 నుండి 13.5 మిలియన్ టన్నుల నూనెను మన దేశం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇందులో 8 నుండి 8.5 మిలియన్ టన్నులు పామాయిలే అవ్వటం మరీ విశేషం. అంటే మనం 63శాతం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అయితే మనం ఏటా దిగుమతి చేసుకునే 8 నుండి 8.5 మిలియన్ టన్నుల పామాయిల్‌ లో 45శాతం ఒక్క ఇండోనేసియా నుంచే దిగుమతి అవుతుంది. మిగిలిన భాగం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇక ఇప్పుడు ఇండోనేసియా తన ఎగుమతులపై నిషేధం విధించుకుంది.

మరి పక్కనే ఉన్న మలేషియాలో కూడా ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల మనదేశంలో వంటనూనె ధరలు ఎంతగా పెరిగిపోయాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇండోనేసియా, మలేసియా నుండి కూడా దిగుమతులు రాకపోతే .. మరి ఆ ప్రభావం ఇంకెంతగా వేదిస్తుందో చూడాలి. దీనితో వంటనూనె ధరలు రానున్నరోజుల్లో ఎలా ఉంటాయి అనేది ఊహకే అందని పెద్ద సమస్యగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: