చైనా బొమ్మలకి చెక్.. ఇండియా సక్సెస్?

praveen
నక్క జిత్తుల మారి చైనా పొరుగున ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని సాధించినట్లుగానే అటు భారత్ పై కూడా ఆధిపత్యం సాధించేందుకు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సరిహద్దుల్లో అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో ఏకంగా నిషేధిత విభాగంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇలాంటి సమయంలోనే భారత ఆర్మీ అప్రమత్తమై ఇక చైనా సైన్యానికి దీటుగా సమాధానం చెప్పింది. అంతే కాదు చైనా సైన్యం ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను సైతం భారత సైన్యం తమ ఆధీనం లోకి తెచ్చుకోవడం గమనార్హం. అదే సమయంలో చైనా సరిహద్దుల్లో సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందేమో అన్న  విధంగా మారిపోయింది పరిస్థితి.


 ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా భారత్ చైనా పై మాత్రం యుద్ధం ప్రకటించింది. అయితే ఆయుధ యుద్ధం కాదు ఆర్థిక యుద్ధం చేస్తూ చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అన్ని రకాల యాప్స్ నిషేధించింది. అంతేకాకుండా ఈ చైనా నుంచి దిగుమతులను ఒక్కొక్కటిగా నిషేధం విధిస్తూ వస్తుంది. ఇక ఇలా చైనా నుండి భారత్ దిగుమతి అయ్యే వాటిలో ఎక్కువగా బొమ్మలు ఉన్నాయి అని చెప్పాలి. చైనా నుంచి చీప్ అండ్ బెస్ట్ గా బొమ్మలు భారత్ దిగుమతి అవుతూ ఉంటాయి.



 ఈ క్రమంలోనే ఇక చైనా నుంచి దిగుమతి అయ్యే బొమ్మల పై భారీ టాక్స్ విధించిన భారత ఒక రకంగా నిషేధించినంత పని చేసింది.  అదే సమయంలో స్వదేశీ బొమ్మలను తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఒకప్పటితో పోలిస్తే భారత్ తో బొమ్మల తయారీ భారీగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్ ఆంక్షల కారణంగా చైనా ఎన్నో వందల కోట్లు నష్టపోయింది అన్న విషయాన్ని ఇటీవల చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా భారత్ మధ్య బొమ్మలకు సంబంధించి 452 మిలియన్ డాలర్ల బిజినెస్ కాస్త 216 మిలియన్ డాలర్లకు పడిపోయింది అన్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: