మంత్రి పదవి రాలేదని.. వెక్కి వెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇటీవలే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిన విధంగానే రెండున్నర సంవత్సరాల పాలన తర్వాత ఇక ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు మంత్రులుగా కొనసాగిన వారు తమ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కొంతమందిలో సంతోషం నింపితే మరి కొంతమందికి మాత్రం చివరికి బాధనే మిగిల్చింది. మంత్రి పదవి దక్కుతుందని రెండున్నర ఏళ్ల నుంచి వేచి చూస్తున్న వారు రెండో విడతలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో కన్నీళ్ళు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక ఇటీవలే నూతన మంత్రివర్గం కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది జగన్ ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే చెప్పాలి. అయితే ఇక రెండో విడత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో తనకు కేబినెట్లో చోటు తగ్గుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కానీ ఇక ఇటీవలే జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఎంతగానో మనస్తాపం చెందారు. మంత్రి పదవి దక్కకపోవడంపై వెక్కివెక్కి ఏడ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దీంతో మంత్రి పదవి దక్కుతుందని ఆయన పెట్టుకున్న ఆశలను ఆవిరి అయ్యాయి అని చెప్పాలి.

 కాగా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించారు అనే చెప్పాలి. ఇక ఇలా మంత్రి పదవి ఆశించిన ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ముగ్గురిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కి సీఎం జగన్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇలా  శ్రీధర్ రెడ్డి పదవి ఆశించి భంగపడటంతో చివరికి వెక్కివెక్కి ఏడ్చారు. తనకు మంత్రి పదవి రాకపోవడం ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక మంత్రి పదవి రాకపోయినా జగనన్న సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: