తమ్మినేనికి అడ్డుగా ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే..?

Deekshitha Reddy
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వచ్చే దఫా మంత్రి వర్గంలో అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లేదని దాదాపుగా తేలిపోయింది. మంత్రులంతా రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా చేయలేదు, చేయమని చెప్పలేదు. కూడా అంటే ఒకరకంగా ఆయనకు మంత్రి పదవి లేదన్నట్టే భావించాలి. అదే సమయంలో రేపు 11వతేదీ అనూహ్యాంగా ఆయన పేరు తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ అది దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా మళ్లీ ఆయన పేరే బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో జగన్ సెకండ్ ఛాన్స్ తీసుకునే అవకాశం కూడా లేదంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత తమ్మినేని సీతారాం.. ఉత్తరాంధ్రకు చెందిన బలమైన నాయకుడు. ఆయనకు మొదటి విడతలో మంత్రి పదవికి బదులు స్పీకర్ పదవి ఇచ్చారు సీఎం జగన్. ఆయన సీనియార్టీకి, సమర్థతకు అది సరిపోయే పదవి అని భావించారంతా. కానీ తమ్మినేని మాత్రం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండో దఫా అవకాశం ఇస్తానన్నారు కాబట్టి, సెకండ్ లిస్ట్ లో ఆయన తన పేరు ఉంటుందని అనుకున్నారు. అయితే అది సాధ్యపడటంలేదు.

తమ్మినేని సీతారాంకు మంత్రి పదవికి ఇచ్చి ఆయన స్థానంలో స్పీకర్ గా మరొకరికి అవకాశం ఇవ్వడం కష్టంగా భావిస్తున్నారట సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక శాసనసభ నిర్వహణ అనుభవంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలింది. సభా నిర్వహణలో ఆయన సమర్థతే ఆయనకు అడ్డంకి అంటున్నారు. పైగా శ్రీకాకుళం రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు మరోసారి అవకాశం దక్కడంలేదట.

శ్రీకాకుళం జిల్లా నుంచి సీదిరి అప్పలరాజుని మంత్రిగా కొనసాగించే అవకాశముంది. అదే సమయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకి అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. ఆ ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే, ఇక ధర్మానకు కష్టమే. ఈ రాజకీయ సమీకరణాల వల్ల సీనియర్ అయినా కూడా స్పీకర్ తమ్మినేనికి ఆ ఛాన్స్ రాలేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: