ఇండియాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ తొలి కేసు నమోదు ?

VAMSI
గత మూడు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనబడని వైరస్ కరోనా ఇంకా మనల్ని వదిలి పెట్టి వెళ్ళలేదు. ఈ మూడు సంవత్సరాల పాటు మానవజాతి అంతా దీనికి దాసోహం అయిందని చెప్పాలి. లక్షల మంది ఈ కరోనా దురాగతానికి బలైపోయారు. అలాగే కోట్ల మంది దీని బారిన పడి మరణపు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చారు. అయితే దీని వలన ప్రపంచానికి ఒక విషయం మాత్రం బాగా తెలిసింది. మన జీవితానికి ఒక గ్యారంటీ లేదు అని బ్రతికి ఉన్న కొద్దీ రోజులు అయినా అందరితో కలిసి మెలిసి సహాయం చేస్తూ ఉండాలని, అయితే ఈ కరోనా వలన మనవాళ్ళు ఎవరో? పరాయి వాళ్ళు ఎవరో కూడా తెలిసే ఉంటుంది? కరోనా సోకినా వారిని కలవడానికి సొంత బంధువులు కూడా రాకపోవడం చాలా బాదాకరం.

అయితే ఈ వైరస్ అప్పటి నుండి వేరియంట్ ల వారీగా వస్తూ మనుషులను అష్టకష్టాలు గురిచేసింది. ఇప్పుడు తాజాగా కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసు ఒకటి ఇండియాలో నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్ లు ఒమిక్రాన్ XE సోకినట్లు తెలుస్తోంది. అయితే మరొక వేరియంట్ కూడా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇండియా వ్యాపార రాజధాని అయిన ముంబైలో ఇద్దరు వ్యక్తులకు ఈ రెండు వేరియంట్ లు సోకాయట. ఒకరిలో కాపా వేరియంట్ మరియు మరొకరిలో ఒమిక్రాన్ XE సోకినట్లు తెలిపారు. ఈ ఒమిక్రాన్ XE వేరియంట్ అన్నిటికన్నా 10 శాతమే వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసిన విషయమే.

దీనితో భారత ప్రభుత్వం కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోగుల పూర్తి వివరాలను వైద్యారోగ్యశాఖ వెల్లడించలేదు. వీరిద్దరినీ కొన్ని రోజుల పాటి పరిక్షించి లక్షణాలు, ఎఫెక్ట్స్ మిగిలిన విషయాలను తెలియచేస్తారు. మరి చూడాలి ఈ వేరియంట్ ప్రమాదకరమా? లేదా ఇంతకు ముందు లాగే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉండదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: