కేసీఆర్ కు ఈసారైనా మోదీ అపాయింట్మెంట్ దొరికేనా?

frame కేసీఆర్ కు ఈసారైనా మోదీ అపాయింట్మెంట్ దొరికేనా?

VAMSI
తెలంగాణ రాష్ట్ర సారథి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అటైనా .. ఇటైనా... విషయం ఎటైనా మాకు ప్లస్సే అన్నట్టుగా ఉంది గులాబీ  వ్యవహారం అంటున్నారు. మరి ఇది తెలంగాణ సిఎం సతీసమేతంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం గురించేనా అంటే అవుననే వినిపిస్తోంది.  సహజంగానే తెలంగాణలో బిజెపి కి గులాబీ పార్టీకి మద్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనేటట్టు ఉంటుంది. అలాంటిది కమలం పార్టీ నుండి వచ్చి గద్దె నెక్కిన ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సిఎంకి అంటే పొత్తు కుదురుతుందా అంటున్నారు.


ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధానిని సైతం రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను గురించి చర్చించాలన్నది సిఎం కేసీఆర్ ప్రణాళిక అన్నది సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రధానిని కలవడానికి సిఎం కేసీఆర్ కు మాత్రం అపాయింట్మెంట్ లభించనే లేదు. అయితే గతం లోనూ  ప్రదానితో భేటీకి కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పిఎం అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే ఈసారి ఎలాగైనా ప్రధానిని కలవాలని రాష్ట్ర ముఖ్యాంశాలను చర్చించాలని సిఎం గట్టిగా ప్రయత్నిస్తున్నారు అంటూ సమాచారం. ఒకవేళ భేటీ దొరికిందా రాష్ట్రంలోని సమస్యలను వివరించి రాజకీయంగా లబ్ది పొందాలని అనుకుంటున్నారట సిఎం.


 అలా కాకుండా మళ్ళీ పిఎం భేటీకి  నిరాకరించి అపాయింట్మెంట్ దొరకకపోతే కేంద్రంపై మరో బలమైన రాయి విసిరేందుకు కావాలనే కేంద్రం కేసీఆర్ ను మీట్ అవడం లేదని నిరూపణ చేసేందుకు, బీజీపీ ని టార్గెట్ చేసేందుకు రెడీ గా ఉన్నారట గులాబీ నాధులు. కాబట్టి భేటీ కుదిరినా కుదరక పోయినా ప్లస్సే అని వెయిట్ చేస్తున్నారట గులాబీ నేతలు. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: