ఢిల్లీ : సుజనాకు ఎంత కష్టమొచ్చింది ?

Vijaya


తాజాగా మాజీలు అవ్వబోతున్న రాజ్యసభ ఎంపీల్లో సుజనా చౌదరి చాలా కీలక వ్యక్తి. మిగిలిన వాళ్ళ వ్యవహారం ఎలాగున్నా సుజనాకు మాత్రం పెద్ద కష్టమే వచ్చింది. అదేమిటంటే తాను రిటైర్ అయిన తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చేయాలా ? లేకపోతే  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీలోనే కంటిన్యు అవ్వాలా ? బీజేపీలోనే కంటిన్యు అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్  పదవీకాలం ముగిసిపోతోంది. విజయసాయికి మళ్ళీ రెన్యువల్ ఖాయమనే అనుకుంటున్నారు. ఇక టీజీ విషయంలో ఆలోచించటానికి ఏమీలేదు.



ఎందుకంటే టీజీ మాజీ అవ్వక వేరే దారిలేదు. మిగిలిన సుజనాకు కూడా మాజీ అవ్వక తప్పదు. అయితే మాజీ అయినా బీజేపీలోనే కంటిన్యు అవ్వక తప్పని పరిస్ధితులు వెంటాడుతున్నాయట. ఈయన మనిషి మాత్రం బీజేపీలోనే ఉన్నా మనసంతా చంద్రబాబునాయుడు దగ్గరే తిరుగుతుంటుందని అందరికీ తెలుసు. స్వతహాగా చంద్రబాబు మినషే కానీ అవసరార్ధం మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత మరో ముగ్గురితో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు.



సరే చరిత్రను వదిలేస్తే పదవీకాలం అయిపోయింది కాబట్టి మళ్ళీ వెంటనే తన మాతృసంస్ధ టీడీపీలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనేచెప్పాలి. కారణాలు ఏమిటంటే ఆయనపైన ఉన్న కేసులే. బ్యాంకుల ద్వారా వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీబీఐ, ఈడీ ఆయనపై అనేక కేసులు నమోదుచేసుంది. ఇదంతా టీడీపీలో ఉన్నపుడే జరిగింది. ఈరోజే రేపో అరెస్టు కూడా ఖాయమని అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత కేసులు, అరెస్టుల భయంతోనే సుజనా బీజేపీలోకి ఫిరాయించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.



సరే అప్పటికే కేసులున్నవారిని బీజేపీ కూడా ఎందుకు  చేర్చుకున్నదంటే మన దరిద్రానికి ఆ పార్టీ కూడా శుద్ధపూస కాదు కాబట్టి+రాజ్యసభలో ఎంపీల అవసరం ఉందికాబట్టి. మరిపుడు పదవి అయిపోయినా తర్వాత ఎందుకు కంటిన్యు అవుతారు ? ఎందుకంటే ఆయనపైన ఉన్న కేసులు అలాగే ఉన్నాయి కాబట్టే. సుజనా గనుక బీజేపీని వదిలేసి మళ్ళీ టీడీపీలోకి వెళిపోతే వెంటనే సీబీఐ, ఈడీ విచారణ స్పీడుచేసే అవకాశముంది. అప్పుడు అరెస్టు తప్పదంటారేమో. అందుకనే మరికొంత కాలం బీజేపీలోనే కంటిన్యు అవ్వక తప్పని అనివార్యత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: