ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి టీడీపీ కచ్చితంగా అధికారంలోకి రావాలీ అని జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో తెలుగు దేశం పార్టీని ఈసారి గెలిపించుకోకపోతే ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందన్నది పార్టీ సామాజికవర్గం బాధ ఆవేదన.అందుకే ఇపుడు కాకపోతే మరెప్పుడు అని జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వైపుగా లాగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలలో తన ఎంట్రీ మీద పక్కా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు సినిమాలే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పేసారు. ఇపుడు తను సినీ జీవితంతో చాలా సంతృప్తి చెందుతున్నాను అని అన్నారు.అయితే ప్రస్తుతం ఇప్పుడన్న మాటలే ఆయన వాడారు. అదే టైం లో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించను అని ఆయన కుండబద్ధలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తూంటే జూనియర్ ఎన్టీయార్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉంది కానీ ప్రస్తుతం మాత్రం ఆయన ఫుల్ క్లారిటీతో సినిమాలు చేసుకుంటారు అని అర్ధం చేసుకోవాలి.
మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల విషయం గనుక తీసుకుంటే వైసీపీ టీడీపీల మధ్య భీకరమైన పోరు సాగే అవకాశం ఉంది. అయినా సరే వైసీపీకే కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది అని తెలుస్తుంది. దాంతో పాటు ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే టీడీపీలో లోకేష్ స్ట్రాంగ్ అవుతారు తప్ప తారక్ కి ఏమీ లాభం లేదు. ఒకవేళ టీడీపీ ఓడిపోతే తన ఇమేజ్ కూడా దెబ్బ తింటుంది అన్న అలోచనలు ఏవో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నాయని టీడిపి సామాజిక వర్గాల వారు అంటున్నారు.కాని ఎన్టీఆర్ నాన్ స్టాప్ గా 2029 ఎన్నికల దాకా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ అపుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మరింతగా రాటుదేలతాడు. ఈలోగా టీడీపీలో నాయకత్వ సమస్య కూడా పూర్తిగా ఓ కొలిక్కి వస్తుంది. దానికి తోడు ఆ ఎన్నికల నాటికి వైసీపీ కూడా పూర్తిగా వీక్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే ఇప్పటికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నో పాలిటిక్స్ అనేశారు అని అంటున్నారు.