కరోనా: ఇండియాలో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా?

VAMSI
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పాటు ప్రజలు ముప్పతిప్పలు పడి పడరాని కష్టాలు పడ్డారు. ఎందరో తమ కుటుంబ సభ్యులను, బంధువులను, సన్నిహితులను కోల్పోయారు. చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ చతికిల పడింది. పిల్లల చదువు అటకెక్కింది. ఇలా అన్ని విధాలుగా కరోనా మన జీవితాలను ప్రభావితం చేసింది. మానవ జాతి మనుగడను ప్రశ్నార్ధకం చేసింది. అయితే గత 5, 6 నెలల నుండి కరోనా ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. ఓ వ్యాక్సిన్ లు రావడం, మరో వైపు ఈ వైరస్ కు మన శరీరం అలవాటు పడటంతో ఈ వైరస్ ప్రభావం బాగా తగ్గుతోంది.
తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం భారత్ లో కరోనా దాదాపుగా సన్నగిల్లినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లో కరోనా మహమ్మారి ప్రళయం క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ గణాంకాల ప్రకారం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం రోజురోజుకీ కరోనా వైరస్ తగ్గుతున్నట్టు కనపడుతోంది. రానున్న రోజుల్లో పూర్తిగా ఈ దేశాన్ని వీడి వెళుతుందన్న ఆశాభావాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ ఇప్పటికీ కొన్ని మీడియా చానెళ్లు కరోనా లో ఇంకొక వేవ్ వస్తోందని, జూన్ నెలకు దేశమంతా పాకుతుందని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. కరోనా ఎలాగూ మనతో జీవించే ఒక జీవరాశి అని అనుకోవాలి. అందుకే కరోనా ఎప్పుడైనా రానివ్వండి. మీరు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇక ముందు కూడా గతంలో లాగానే మాస్క్ వాడుతూ, శానిటైజర్ అప్లై చేసుకుని, బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించి కరోనా నుండి రక్షణ పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: