ఉక్రెయిన్‌ యుద్ధంతో పుతిన్‌ ప్రేయసికి ఎన్నికష్టాలో?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా కొన్ని లక్షల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. లక్షలమంది ఉక్రెయిన్లు వలసపోతున్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా చివరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడుతోంది. అదేంటి పుతిన్‌ కు లవర్ కూడా ఉందా... అని ఆశ్చర్యపోతున్నారా.. పుతిన్‌ కు కూడా ఓ ప్రేయసి ఉంది. అయితే.. పుతిన్ ఆమెను ఎప్పుడూ తన ప్రేయసి అని బహిరంగంగా  ప్రకటించేలేదు.


కానీ.. వీరిద్దరు ప్రేయసీ ప్రియులు అని చెప్పేందుకు ఎన్నో ప్రాసంగిక ఆధారాలు ఉన్నాయని రష్యా మీడియా చాన్నాళ్లుగా కోడై కూసింది. ఇంతకీ పుతిన్ ప్రేయసి ఎవరంటే.. ఆమె పేరు అలీనా.. ఆమె పుతిన్‌కే చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి గతంలో ప్రాతినిధ్యం వహించింది. ఆరేళ్లపాటు రష్యా పార్లమెంటు సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నేషనల్ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు చైర్‌ పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఇదే పదవిలో ఏడేళ్లుగా కొనసాగుతున్నారు.


అంత వరకూ బాగానే ఉంది. పుతిన్‌కు ఉన్న సంబంధం అన్నది వారి ప్రైవేటు ఎఫయిర్ గానే ఇన్నాళ్లూ సాగింది. కానీ.. రష్యాపై వివిధ దేశాలు విధిస్తున్న ఆంక్షల కారణంగా పుతిన్ ప్రేయసి అలీనా ఇబ్బంది పడుతోంది. పుతిన్ ప్రేయసి అలీనా కబయేవా ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం రష్యా అధినేత పుతిన్ ప్రేయసికి ఆవాసం కల్పించకూడదన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పనిచేసే ఛేంజ్‌.ఆర్గ్‌  వెబ్‌ సైట్‌ ఓ ఓటింగ్ నిర్వహిస్తోంది.


ఈ ఛేంజ్‌ ఆర్గ్ టాడ్‌ కామ్‌లో మూడు దేశాలకు చెందినవారు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రష్యా వాసులు కూడా ఉంన్నారు. రష్యాతో పాటు ఇంకా ఉక్రెయిన్‌, బెలారస్‌కు చెందిన వారు కూడా  ఉన్నారు. అయితే ఛేజ్‌ ఆర్గ్ డాట్‌లో పెట్టిన ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50వేల మంది సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. పుతిన్ ప్రేయసిని ఇబ్బంది పెట్టడం ద్వారా పుతిన్‌ను మానసికంగా బలహీనపరిచేందుకు అమెరికా వంటి దేశాలు పని చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: