అమరావతి : పవన్ చెప్పేది ఒక్కటైనా జరుగుతుందా ?

Vijaya




జనసేన ఆవిర్భావ దినోత్పవం సందర్భంగా రాష్ట్రాభివృద్ధి గురించి చాలా చెప్పారు. ఇందులో విచిత్రమేమిటంటే బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారట. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేస్తున్న కేంద్రం, ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న నరేంద్రమోడి సర్కార్ ఏపీని అభివృద్ధి చేస్తుందట. ఇంకా విచిత్రం ఏమిటంటే రాష్ట్రాభివృద్ధి చాలా ప్లాన్లు చెప్పారు. ఆర్ధికంగా యువతను బలోపేతం చేయటానికి తాను ఏమి చేయబోతున్నాననే విషయాన్ని కూడా చెప్పారు.




అయితే పవన్ చెప్పేవేవీ ఆచరణ సాధ్యంకాదు. ఎందుకంటే అప్పులు తేకుండా పవన్ ఒక్కపని కూడా చేయలేరు. ఇపుడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ముంచేస్తున్నారంటు పదే పదే ఆరోపణలు చేస్తున్న పవన్ రేపు తానేం చేయబోతున్నారు ? పవన్ ఇపుడు చెప్పిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడినుండి తెస్తారు ? అప్పులు తీసుకురాకుండా అభివృద్ధి, సంక్షేమం సాధ్యమేనా ?




అలాగే రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని, ఎక్కడికి తరలిపోదని బల్లగుద్ది పవన్ చెప్పారు. మరి అమరావతిని అభివృద్ధి చేసే ప్రణాళిక పవన్ దగ్గర ఏముందో ఎవరికీ తెలీదు. చంద్రబాబునాయుడు లెక్కల ప్రకారం మొదటి దశ అభివృద్ధికే రు. 1.10 కోట్లు అవసరమవుతుంది. పవన్ చెప్పినట్లుగా జీతాలకు, బత్యాలకే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నది నిజమే అనుకుందాం. మరి పవన్ వస్తే ఏమన్నా మంత్రదండం వచ్చేస్తుందా ? పవన్ సీఎం అయిపోగానే కనకధారా స్తోత్రంలో చెప్పినట్లుగా డబ్బుల వర్షం కురుస్తుందా ?




 సో వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్ చెప్పినట్లుగా ఒక్కటి కూడా జరగదు. బీజేపీతో కలిసి అభివృద్ధి అనేది కలలోని మాటే అనటంలో సందేహమేలేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయినదగ్గర నుండి ఇప్పటివరకు పేదలు, మధ్య తరగతి జనాలకు చేసిందేమీ పెద్దగా లేదనే చెప్పాలి. అయినా పవన్ అధికారంలోకి రావాలంటే ముందు జనాలు నమ్మాలికదా. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని జగన్ను ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న పవన్ కు జనాలు టీడీపీని ఎందుకు ఘోరంగా ఓడించారో తెలీకుండానే ఉంటుందా ?





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: