జర భద్రం: ఏమరుపాటుగా ఉన్నారా "కరోనా కాటేస్తది"?
మరో వైపు దక్షిణ కొరియాలోను ఇదే పరిస్థితి నెలకొంది. కొత్త వేరియంట్ తో విలయం కొనసాగుతోంది. రోజుకు 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో అక్కడ కలకలం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్ బయటపడడం తో ప్రజలు వణికిపోతున్నారు. ఇలా పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసుల సునామీ మొదలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత వరకు ప్రభావం చూపుతుంది? అత్యంత ప్రమాదమా అన్న వివరాలకై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా పలు దేశాల్లో మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ సంచారం భారత్ లోని ప్రజలను కంగారు పెడుతోంది. గతంలో ఇదే విధంగా ఎక్కడో చైనా లో కేసులు కదా అనుకున్నందుకే ఎంతటి ఘోరప్రళయాన్ని సృష్టించిందో మనము చూశాము. అయితే ఇప్పుడు పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే, కరోనా నిబంధనలకు మళ్ళీ అలవాటు పడాలి. ఎప్పటిలాగే మాస్క్, శానిటైజర్ మరియు భౌతిక దూరం పాటించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నారా మళ్ళీ తన ప్రభావాన్ని చూపి మీ జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది.