ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి శాసనసభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక ప్రకటన చేయడంతో రాష్ట్రంలో వున్న నిరుద్యోగులు అందరూ కూడా దెబ్బకు అలెర్ట్ అయ్యారు.ఇక అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారు సన్నద్ధమవుతున్నారు. కాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ పోలీసు శాఖ (Police Department) నుంచి వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ( TSLPRB) కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జోన్ల వారీగా ఖాళీల లిస్టును కూడా సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఏంటంటే ఈ నెలాఖరున లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో కాని పోలీసుల ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో సుమారు 18 వేలకుపైగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.కాగా ప్రభుత్వం శాఖల వారీగా ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలంటే కొంత టైం అనేది పడుతుంది. ఉదాహరణకు విద్యాశాఖను కనుక తీసుకుంటే ఇందులోని ఖాళీలను భర్తీ చేయాలంటే మొదట టెట్ ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పోలీస్ శాఖ విషయంలో మాత్రం అలా కాదు. నేరుగా నియామకాల ప్రక్రియను కూడా స్టార్ట్ చేయవచ్చు. నాలుగు సంవత్సరాల క్రితం సుమారు 16వేల ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేయడమే ఇందుకు నిదర్శనం.
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థుల శిక్షణ పూర్తికాగానే మరోసారి భారీగా పోలీసుల నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది.అలాగే హోంమంత్రి కూడా అదే చెప్పుకొచ్చారు.ఇక దీనికి తగ్గట్లుగానే అసెంబ్లీ సాక్షిగా భారీగా కొలువుల భర్తీపై కీలక ప్రకటన చేశారు ముఖ్య మంత్రి కేసీఆర్. ఇక దీంతో రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి అప్రమత్తమైంది. కొత్త జిల్లాలు ఇంకా జోన్ల వారీగా ఖాళీల వివరాలను కూడా సేకరించింది.తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పోలీస్‌శాఖ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.