కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో సరైన రక్షణ లేక మహిళలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ నేత విజయశాంతి. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని ఆమె ఆరోపించారు. గతంలో ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవని, భద్రత లేని ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాధ్ ఇప్పుడు మహిళలకు భద్రత కల్పించారని అన్నారు విజయశాంతి. వారిద్దరి హయాంలో యూపీ మాఫియా చేతుల్లోనుంచి బయటపడిందని చెప్పారు. యూపీలో యోగి టీమ్ రెండో సారి గెలిచిందంటే అక్కడ వారు చేసిన మంచి పనుల వల్లేనని కొనియాడారు విజయశాంతి.
యూపీతో పోలిక పెడుతూ తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యూపీలో ఉన్న ప్రభుత్వం లాంటి ప్రభుత్వం లేదని విమర్శించారు విజయశాంతి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు విజయశాంతి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కేసీఆర్ కి ఉద్యోగాలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు విజయశాంతి. ఉద్యోగాలు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇకనైనా ప్రజలు మారాలని సూచించారామె. తెలంగాణలో కూడా మంచి రోజులు రావాలంటే, డబుల్ ఇంజిన్ అభివృద్ధిన కోరుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి తెస్తే, తెలంగాణ రూపు రేఖలు మారిపోతాయని హామీ ఇచ్చారు.