ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళకి బ్యాడ్ న్యూస్?
ఇక ఇలాంటి సదుపాయం ఉన్న తర్వాత ఎవరైనా ఉపయోగించుకోకుండా ఉంటారా కూర్చున్న చోటు నుంచి తమకు కావాల్సిన అన్నింటిని ఆధార్ చేస్తున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఇలా కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేసేందుకు ప్రస్తుతం ఎన్నో సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే స్విగ్గి జొమాటో ద్వారా ఎంతోమంది ఫుడ్ డెలివరీ పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవల ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ఊహించని షాక్ తగిలింది. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సేవలకు ఇటీవలే అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు అందరూ కూడా పలురకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది తెలుస్తుంది. ఇక కొంతమంది వినియోగదారుల ఆర్డర్లు మధ్యలోనే ఉండడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జొమాటో ను ట్యాగ్ చేసి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సుమారు గంట రెండు గంటల పాటు జొమాటో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. జొమాటో తో పాటు ఫుడ్ డెలివరీ యాప్ అయినా స్విగ్గి కూడా కాసేపు డౌన్ అయినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం యధావిధిగాసర్వీసులు పనిచేస్తున్నాయి.