దేశ రాజకీయాల్లో "కాంగ్రెస్ దుఖాన్ బంద్"... ఇక సెలవు ?
ఆఖరికి ఎంత దారుణం అంటే అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ ఘోర పరాభవం ఎదురైంది. ఎంతలా అంటే సీఎం గా ఉన్న చన్నీ మరియు పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇద్దరూ కూడా ఓటమి పాలవ్వడం చూస్తుంటే పంజాబ్ లో ప్రజలు కాంగ్రెస్ పై ఎంతటి వ్యతిరేకతను పెంచుకున్నారు అనేది అర్థమవుతోంది. దీనితో ఒక స్థానిక పార్టీ అయిన ఆప్ కు అధికారాన్ని కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యానికి అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా నిలిచాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన రాష్ట్రాలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల ముందు వరకు మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాస్తా రెండు రాష్ట్రాలకు పడిపోయింది.
ఇప్పుడు కేవలం రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అయితే రోజు రోజుకి కాంగ్రెస్ బలహీనంగా మారుతోంది. దేశ రాజకీయాల్లో ఘనమైన చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ ఇంతలా బలహీనపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలు ఓటమి వెనుక ఉన్న వాస్తవాలను గ్రహించి ఇక ముందు జరిగే ఎన్నికలకు సన్నద్ధం కావాలి లేదంటే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు.