ఆ మూడు సీట్లలో టీడీపీకి నో ఛాన్స్?
తమకు ఇన్ని సీట్లు రావొచ్చు..అన్ని సీట్లు రావొచ్చు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు..అలాగే ఆ నియోజకవర్గంలో తాము గెలుస్తామని, ఈ నియోజకవర్గంలో తాము గెలుస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు..ఇదే క్రమంలో ప్రకాశం జిల్లాలో టీడీపీ మూడు చోట్ల మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సీట్లలో టీడీపీకి మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది..ఈ మూడు చోట్ల మళ్ళీ వైసీపీ గెలుస్తుందని ప్రచారం జరుగుతుంది.
గత ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 4 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే...మధ్యలో చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే..దీంతో టీడీపీ బలం 3కు పడిపోయింది..అయితే ఈ సారి ఆ మూడు సీట్లలో టీడీపీ మళ్ళీ గెలవచ్చని తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు, కొండపి సీట్లలో టీడీపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది. అలాగే వైసీపీ సిట్టింగ్ స్థానలైన...దర్శి, ఒంగోలు, సంతనూతలపాడు, కందుకూరు, కనిగిరి లాంటి సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెబుతున్నారు.
అదే సమయంలో గిద్దలూరు, వై.పాలెం, మార్కాపురం స్థానాల్లో మాత్రం టీడీపీ గెలవడం చాలా కష్టమని తెలుస్తోంది...మళ్ళీ ఈ మూడు చోట్ల వైసీపీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం...పైగా మూడు చోట్ల వైసీపీ బలంగా కనిపిస్తోంది..కాబట్టి ఈ మూడు స్థానాల్లో మళ్ళీ టీడీపీ గెలవడం అంది జరిగే పని కాదని తెలుస్తోంది. మొత్తానికి ప్రకాశంలో టీడీపీకి మూడు సీట్లపై ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదనే అంటున్నారు.