ఫైర్ బ్రాండ్ రోజా: అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి... ?

VAMSI
నిన్న ప్రపంచ వ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. నిన్న ఒక్కరోజు అయినా ఎక్కడా కూడా మహిళలపై ఏ విధమైన అఘాయిత్యాలు జరిగి ఉండవని అనుకుంటున్నాను. అయితే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రతిపక్ష పార్టీ టిడిపిపై ఫైర్ అయ్యారు. అంతకు ముందు ఒక మీటింగ్ లో టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన ఒక కామెంట్ ను తీసుకుని రోజా సరిగ్గా బదులిచ్చారు. రోజా మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చెప్పిన విధంగా 2024 ఎన్నికల్లో టీడీపీ కి 160 సీట్లు కాదు కదా, ఇప్పుడున్న 23 సీట్లను కాపాడుకునే పరిస్థితి ఉండబోదని సవాల్ చేసింది.

ఇప్పటికే టీడీపీ నాయకులకు తెలిసి ఉంటుంది రాష్ట్ర ప్రజలలో వారికి ఎంత మద్దతు ఉందో అని... దీనికి రుజువు కావాలంటే టెక్కలి ఎమ్మెల్యే గా ఉన్న అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి చూడు అప్పుడు తెలుస్తుంది టీడీపీకి ఎంత బలం ఉందో ప్రజల్లో... ప్రతి మహిళ తమ యొక్క శక్తిని టీడీపీ కి వ్యతిరేకంగా ఓటు వేసి చూపిస్తారని చెప్పారు. ముందు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోండి తర్వాతనే మా మీద సెటైర్ లు వేయవచ్చు అని ఘాటుగా సమాధానమిచ్చింది. మహిళల గురించి  మాట్లాడే కనీస హక్కు కూడా టీడీపీకి లేదని హెచ్చరించింది. ఏపీ సీఎం జగన్ సారథ్యంలో  రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలని వారికోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారు.

అలాంటి జగన్ కి మీతో పోలిక ఏంటి అంటూ చంద్రబాబు అండ్ కో ను ఏకిపారేసింది. చంద్రబాబు మరియు జగన్ ఇద్దరూ ఒకటి కాదు. జగన్ రాష్ట్ర మహిళలకు దేవుడు లాంటి వాడని కొనియాడింది. జగన్ ను రాష్ట్ర మహిళ ఆశీస్సులు ఉన్నాయని, ఎంత మంది ఎన్ని కుయుక్తులు పన్నినా ఏమీ చేయలేరని గట్టిగా చెప్పారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: