మందుబాబులకు భారీ షాక్.. పెరిగిన మద్యం ధరలు?

praveen
ఇటీవలి కాలంలో మద్యం ధరలు పెరిగినా తగ్గినా అటు మందు బాబులు మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. మద్యం  ధరలు తగ్గినప్పుడు మద్యం సేవించడం కాస్త ఎక్కువ చేస్తున్నారు కానీ
.. మద్యం ధరలు పెరిగినప్పుడు మాత్రం మద్యానికి దూరం కాలేక పోతున్నారు. ఇకపోతే ఇటీవలే పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మద్యం ధరలు పెంచుతూ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలు భారీగా పెంచేసింది.


 మద్యం ధరలు 180ml బాటిల్ పై పది రూపాయలు.. 375ml మద్యం బాటిల్ పై 20 రూపాయలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ధరలు నేటి నుంచే అమలులోకి రాబోతున్నాయి అన్నది తెలుస్తోంది. మార్చి 5వ తేదీన జరిగిన తమిళనాడు క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఆ రాష్ట్రంలో మద్యం విక్రయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కసారిగా మద్యం ధరలు పెరగడంతో మందు బాబులకు షాక్ తగిలింది.


 కాగా చివరిగా 2020 మే నెల లో మద్యం ధరలు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఆ సమయంలో గరిష్టంగా మద్యం ధరలు 20 రూపాయల వరకు పెంచారు. అయితే ప్రస్తుతం మద్యం దుకాణాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి తీసుకు రావడం గమనార్హం. కానీ అటు తమిళనాడు ప్రభుత్వానికి టాస్మాక్ దుకాణాల  ద్వారానే ఎక్కువగా ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఇక మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయలేకపోతుంది ప్రభుత్వం. ఇటీవలే క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మద్యం ధరలు పది రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెరగవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: