ఆడపిల్లలు ఆపదలో ఉన్నారా ? ఇక భయమక్కర్లేదు ఇలా చేయండి ?

VAMSI
దేశంలో ఆడపిల్లపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా గంటకు ఒకటైనా అత్యాచారం జరుగుతోంది. అయితే మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణాలో జరిగిన దిశ ఘటన ఎంతటి సంచలనం అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహిళ రక్షణ చర్యలు వేగవంతం అయ్యాయి. ఎప్పటికప్పుడు మహిళ సంరక్షణ కొరకు రాష్ట్రాలు సరికొత్త ఆలోచనలతో మహిళలకు రక్షణ పెంచే విధంగా నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య టెక్నాలజీని కూడా ఎక్కువగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో రక్షణ చర్యను మన ముందుకు తీసుకొచ్చింది. యువతులు, మహిళలు భద్రత కొరకు రాష్ట్ర మహిళా కమిషన్ మరో కొత్త what's app నంబర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ వాట్స్ యాప్ నంబర్ అందుబాటులోకి  తీసుకు రావడం జరిగింది. ఆపద ఎదురయ్యింది అన్న సమయంలో మహిళలు, యువతులు ఈ వాట్స్ యాప్ నంబర్ కు ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు దగ్గర లోని పోలీసు అధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, ఆ వెను వెంటనే పోలీసులు రంగం లోకి దిగి భద్రత కల్పించి అండగా నిలబడతారు. ఈ నంబర్ ను అందరూ మహిళలు, యువతులకు తెలిసేలా కాలేజీ, స్కూల్స్ ఇలా ప్రతి చోట గోడలపై రాయించబోతున్నట్లు మహిళ కమిషన్ ప్రతినిదులు పేర్కొన్నారు.
ఇలా మహిళలకు భద్రత పెంచడం వలన ఎవరైనా సరే మహిళలు, యువతుల విషయంలో చిన్న తప్పు చేయడానికి సైతం ఆలోచించకుండా ఉండేలా చేయాలన్నదే వారి ధ్యేయం అని తెలిపారు. ఈ నూతన వాట్స్ యాప్ నంబర్ ను ప్రతి మహిళ ముందు జాగ్రత్త కొరకు  సేవ్ చేసుకోవడం మంచిది అని తెలిపారు. ఈ నెంబర్ ను 9490555533 నోట్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: