అమరావతి విజయంపై బీజేపీ టీడీపీ మధ్య కోల్డ్ వార్..
అదే సమయంలో పార్లమెంట్ లో పదే పదే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ స్పష్టం చేస్తోంది. అంటే పరోక్షంగా మూడు రాజధానులకు బీజేపీ మద్దతు ఉన్నట్టేనా అనేది కూడా అనుమానంగా ఉంది. దీంతో టీడీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తోంది. రైతులకు మద్దతుగా నిలిచింది తామేనని చెబుతోంది. ఆ విషయంలో పూర్తి క్రెడిట్ తమకే కావాలంటోంది టీడీపీ.
విజయోత్సవ సభ..
రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో అమరావతిలో భారీ విజయోత్సవ సభ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామంటున్నారు నేతలు. కాదు కాదు టీడీపీయే ముందు సభ పెట్టాలంటున్నారు మరికొంతమంది. కానీ బీజేపీయే ముందుగా సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సభకు జాతీయ నాయకులను కూడా ఆహ్వానిస్తారట. ఏపీలో రాజధాని అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని హైలెట్ చేసేందుకు, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ, టీడీపీ ఎవరికి వారే ఆ విజయం తమదేనంటున్నారు. ప్రయత్నం ఎవరిదైనా, ప్రోత్సాహం ఎవరిదైన.. అంతిమంగా అమరావతి రైతులు హైకోర్టులో విజయం సాదించారు. అమరావతి అభివృద్ధికోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేనంటూ కోర్టు తీర్పునివ్వడంతో అందరూ సంబరపడుతున్నారు. ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. అదే అమలులోకి వస్తే రాజధాని రైతులకు మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి.