హై కోర్ట్ తీర్పు పై మాజీ వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు...
రాజధాని అమరావతి విషయంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సబబు అని వారు అనుకుంటున్నారు అని అన్నారు. అయితే ఈ కోర్ట్ లు తమకు అవసరమైన అంశాలను మాత్రమే తీసుకుంటుందని , ప్రజలకు అవసరమయిన వాటిని పరిగణలోకి తీసుకోదని కామెంట్ చేశాడు. ఇక్కడ న్యాయ వ్యవస్థ మరియు శాసన వ్యవస్థలో దేనికి విలువ ఉందని ఆయన అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల కోసం మేము తీయూస్కున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ హై కోర్ట్ నిద్రపోతోందా అంటూ ప్రశ్నించారు. న్యాయ వ్యవాట్షపై ప్రజలకు నమ్మకం ఉండేలా తీర్పులు ఉండాలని సలహా ఇచ్చారు.
అసెంబ్లీ లో చేసిన చట్టాలు చెల్లవు అని చెప్పడానికి కోర్ట్ లకు ఏమి అధికారం ఉందని చురకలు అంటించారు. ఇలా మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించినట్లు కదా అంటూ మాట్లాడారు. అయితే రాష్ట్ర విభజన పై చాల పిటీషన్ లు వేశారని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో చెప్పాలన్నారు. ఇలా మోదుగుల హై కోర్ట్ తీర్పుపై తనదైన శైలిలో రెచ్చిపోయారు. మరి ముందు ముందు ఈ విషయంపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.