చంద్రబాబుకు షాక్.. మరోనేత హఠాత్మరణం?
ఇక ఆయన హఠాత్ మరణం తో ఏపీ రాజకీయాల్లో మరో సారి విషాద నిండి పోయింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆనంద్ బాబు, జవహర్, ఎమ్మెల్యేలు నంబూరి శంకరరావు, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరికొంతమంది నేతలు సంతాపం తెలియజేశారు. ఇక ఇటీవలే ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
టిడిపి పార్టీలో కుమారస్వామి ఎంతగానో సేవలు చేశారని ఆయన హఠాత్ మరణం పార్టీకే కాదు వ్యక్తిగతం గా తనకు తీరని లోటు అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక కుమారస్వామి కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుంటూరు లో సాయంత్రం జరగబోతున్న కుమారస్వామి అంత్య క్రియలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా హఠాత్ మరణం చెందిన టిడిపి నేత కుమారస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు..