రష్యాకు భయపడేది లేదు లొంగేది అసలే లేదంటూ జలన్ స్కి ప్రతిజ్ఞ చేశారు. యూరోపియన్ యూనియన్ ను ఉద్దేశించి జలన్ స్కి కీలక ప్రసంగాన్ని చేశారు. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలవాలని ఆయన కోరుకున్నారు. యు యూ దేశాలు తమ శక్తి నిరూపించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఆయన ప్రసంగానికి అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. వ్యాక్యూమ్ బాంబులను వాడడం లేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటుగా రెండవ ప్రధాన నగరమైన కార్గివ్ పై రష్యా బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాయి ఈ నగరంలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది.
ఇక్కడ కార్కివ్ అడ్మినిస్ట్రేట్ షిపని దాడిలో మొత్తం ధ్వంసమైంది. ఈ బిల్డింగ్ ముందు ఉన్న వాళ్లు కూడా ఈ దాడిలో చనిపోయారు. రష్యా ఇంకా అధునాతన ఆయుధాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ బాంబు దాడులతో బెంబేలెత్తిపోతున్నారు ఉక్రెయిన్ వాసులు. పిల్లాపాపలతో సహా దేశం విడిచి సరిహద్దు దేశాలకు వలస వెళుతున్నారు. పోలెండు తో పాటు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్లోని బంకర్లలో ఉండేవారు కూడా బయటకు వచ్చి దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల మంది దేశం విడిచారు. ఓవైపు బాంబుల వర్షం కురిపిస్తూనే రష్యా మరోసారి చర్చలకు సిద్ధమైంది. బెలారస్ లో రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు ఈరోజు జరగనున్నాయి. అయితే ఈ చర్చలతో యుద్ధం ఆగుతుందని శాంతి విరాజిల్లుతుంది అని నమ్మకం ఎవరికి కూడా కనిపించడం లేదు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా బలగాలు ఏ క్షణంలోనైనా స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కీవ్ నగరానికి అత్యంత సమీపంలో దూసుకొచ్చాయి రష్యా బలగాలు, దీనికి సంబంధించిన శాటిలైట్ మ్యాప్ లు కూడా బయటకు వచ్చాయి. ఈ షిపని, యుద్ధ విమానాలు, సైనిక వాహనాలతో ఆ నగరం మొత్తం నిండిపోయింది. ఏం జరిగినా ప్రాణాలు పోయినా రష్యాకు లొంగేది లేదు, రష్యాకు తగిన గుణపాఠం చెబుతామని ప్రతిజ్ఞ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జాలెన్ స్కి. యూరోపియన్ యూనియన్ ఉద్దేశించి జాలెన్ స్కి కీలక ప్రసంగం చేశారు. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలు అండగా నిలవాలని కోరారు.