అమరావతి : అధికారంలోకి రావాలంటే చంద్రబాబుకు ఒకటే దారా ?

Vijaya



ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఘోరంగా ఉందన్నది వాస్తవం. 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బకు టీడీపీకి దిమ్మ తిరిగిపోయింది. ఆ దెబ్బనుండి ఇంకా కోలుకోలేదు. ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబునాయుడు కేవలం ఎల్లోమీడియాను మాత్రమే నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ కన్నా ఎల్లోమీడియానే ఎక్కువగా పోరాటంచేస్తోంది. అయితే ఈ మీడియాకు జనాల్లో క్రెడిబులిటి లేకపోవటమే చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారిపోయింది.





ఇలాంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చితీరాలి. లేకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో మిగిలిన వాళ్ళకన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. గ్రౌండ్ లెవల్లో అయితే అధికారంలోకి వచ్చేది అనుమానమే. మరేం చేయాలి ? అన్నదే ఇపుడు చంద్రబాబు ముందున్న తక్షణ సమస్య. ఇందుకు ఒకటే పరిష్కారంగా కనబడుతోంది. అదేమిటంటే పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించటం. అలా ప్రకటిస్తేనే జనేసేనతో పొత్తు సాధ్యమవుతుంది.





రేపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీకోసం చంద్రబాబు తహతహ లాడిపోతున్నారు. ఎలాగైనా చివరిసారిగా సీఎం కుర్చీలో కూర్చునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. తాను ఉన్నపుడు చినబాబును కుర్చీలో కూర్చోబెట్టేస్తే చంద్రబాబు మీద పెద్ద భారం తీరిపోతుంది. అందుకనే ఇంతగా తాపత్రయపడుతున్నారు. ఈ నేపధ్యంలో తానే సీఎంగా జనసేనతో పొత్తంటే దాదాపు అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబును సీఎం చేయటానికి టీడీపీతో పొత్తు అవసరం లేదని జనసేనలోని కీలక నేతలు పవన్ కు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.




ఇదే సమయంలో తెలంగాణాలో సమీకరణల్లో భాగంగా టీఆర్ఎస్-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేసీయార్ తో పవన్ చేతులు కలిపితే ఇక చంద్రబాబు పనైపోయినట్లే అనుకోవాలి. అందుకనే చంద్రబాబు అడ్వాన్సయి పవన్ను గనుక ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించి, ప్రకటిస్తే ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోవటం ఖాయం. చంద్రబాబు, ఎల్లోమీడియా ఘోషిస్తున్నట్లు ప్రభుత్వంపై జనాలు వ్యతిరేకంగా ఉంటే టీడీపీ+జనసేన పొత్తుని జనాలు యాక్సెప్ట్ చేస్తారేమో. లేకపోతే మళ్ళీ ఐదేళ్ళు వీళ్ళిద్దరు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: