అమరావతి : చంద్రబాబుకు ‘భీమ్లా’ షాక్ తప్పదా ?

Vijaya



రాబోయే ఎన్నికలకు సంబందించి చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. చివరి నిముషంలో భీమ్లానాయక్ @ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు హ్యాండిచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఇలాంటి సంకేతాలు తెలంగాణా నుండి కనబడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణా నుండి ఎలాగంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్+జనసేన కలిసి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.



కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది వాస్తవం. ప్రతిపక్షాల్లోని బీజేపీ, కాంగ్రెస్ లు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని జబ్బలు చరుచుకుంటున్నాయి. ఇందులో ఎంత వాస్తవమో కాలమే నిర్ణయించాలి.  దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతినటం, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర ఓటమి అందరికీ తెలిసిందే.



ఉపఎన్నికల్లోను, స్ధానిక సంస్ధల్లో అధికారపార్టీ గెలుపు పెద్ద విషయమే కాదు. కానీ ఇదే ఎన్నికల్లో అధికారపార్టీ ఓడిపోతే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితోనే జనాల్లో కేసీయార్ పై ఎంతగా వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ కు ఒక భాగస్వామ్యపార్టీ అవసరమైంది. ఇందులో భాగంగానే రెగ్యులర్ గా పవన్ తో కేసీయార్+కేటీయార్ టచ్ లో ఉంటున్నారు.



పవన్ కున్న అభిమానుల ఓట్లను అడ్వాంటేజ్ గా తీసుకోవాలని కేసీయర్ ప్లాన్ చేశారట. అందుకనే జనేసేనతో పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలున్నాయి. నిజంగా టీఆర్ఎస్+జనసేన పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం ముందుగా పడేది చంద్రబాబు మీదే. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. కేసీయార్ తో జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీతో ఇక అవకాశం ఉండదు. బీజేపీతో పవన్ కలిసున్నా, విడిపోయినా పెద్దగా లాభనష్టాలుండవు.  



ఏపీలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే కనీసం తెలంగాణాలో అయినా జనసేన బలంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. అందుకనే పార్టీని బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు చేయాలని ప్లాన్ చేశారు. పవన్ ఇవన్నీ చేస్తే పొత్తులో టీఆర్ఎస్ కు కూడా లాభమే. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒంటరిగా పోటీచేసి రిస్క్ తీసుకునేబదులు జనసేనతో పొత్తు పెట్టుకోవటమే మేలని కేసీయార్ భావించినట్లు సమాచారం. కాబట్టి చివరి నిముషంలో చంద్రబాబుకు పవన్ షాక్ తప్పదనే అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: