ఎన్నికలకు చాలా దూరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే సర్వేల కలకలం ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ మొదలయింది.మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహిస్తున్న సర్వేల మాదిరిగానే పీకే టీం కూడా సర్వేల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల గెలుపు ఓటములకు సంబంధించిన కారణాలను విశ్లేషించేందుకు సిద్ధం అవుతూ ఉంటుంది.అదేవిధంగా పథకాల అమలు తీరు, అభివృద్ధి పనులు జరుగుతున్న రీతి వీటిపై కూడా పీకే టీం ఇప్పటికే అనేక సార్లు జగన్ కు నివేదికలు ఇచ్చిందని సమాచారం.అందుకే జగన్ తన కన్నా తన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కన్నా పీకే ఇచ్చే నివేదికలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. తాజాగా ఇదే విధంగా తెలంగాణలో కేసీఆర్ కు కూడా పీకే టీం ఓ అనుబంధ వ్యవస్థగా మారనుంది అని నిర్థారణ అయింది. ఇందుకు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో.. రెండంటే రెండు ప్రాజెక్టులను నమ్ముకున్నాడు కేసీఆర్. ఒకటి మల్లన్నసాగర్, రెండు కొండ పోచమ్మ సాగర్. ఈరెండు ప్రాజెక్టుల ఆధారంగా జరిగిన అభివృద్ధి, జరగబోతున్న అభివృద్ధి ఇవన్నీ కూడా వివరించనున్నాడు కేసీఆర్.అది కూడా తెలంగాణలో కాదు జాతీయ స్థాయిలో! ఆవిధంగా ఆయన మోడీ కన్నా వేగంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించి పేరు తెచ్చుకోవాలని తహ తహలాడుతున్నాడు.ఈ దశలో సీన్ లోకి ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఎంట్రీ ఇచ్చాడు.
నిన్నటి వేళ కేసీఆర్ ఫాం హౌస్ లో పీకే తో భేటీ అయ్యారు కేసీఆర్.ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలు గురించి, ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా బీజేపీ అమలు చేస్తున్న విధానాల గురించి కూడా చర్చకు వచ్చింది అని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో సర్వే చేసేందుకు పీకే టీం సమయాత్తం అవుతోందని తెలుస్తోంది.దీంతో గులాబీ దండులో అప్పుడే కల్లోలం మొదలయింది.