సీటు తేల్చుకో పవన్?
అటు అధికార వైసీపీకి ఎలాగో 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక ఇందులో ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది..ఇలా వైసీపీ-టీడీపీలు ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉన్నాయి...కానీ మూడో శక్తిగా అవతరించాలని చూస్తున్న పవన్ కల్యాణ్ మాత్రం..ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు...ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసామా? లేదా? అనే కోణంలోనే పనిచేసుకుంటూ వెళుతున్నారు...అసలు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టాలనే అంశం ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.
పైగా 175 స్థానాల్లో జనసేనకు నాయకులు లేరు..అలాంటప్పుడు పవన్ ఇంకా దూకుడుగా పనిచేయాలి..కానీ ఆ దూకుడు పవన్‌లో కనిపించడం లేదు. ఇక ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే..ఇంకా పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు ఏదో తేలకపోవడం..గత ఎన్నికల్లో అంటే గాజువాక, భీమవరంల్లో పోటీ చేసి ఓడిపోయారు..మరి ఈ సారి పవన్ ఎక్కడ బరిలో దిగుతారో క్లారిటీ లేదు.
అసలు ఎన్నికల ముందు సీటుని ఫిక్స్ చేసుకోవడం కంటే...ఇప్పుడే సీటు ఫిక్స్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది...ఇప్పటినుంచి పనిచేసుకుంటూ వెళితే రాజకీయంగా బలపడొచ్చు...అలా కాకుండా వచ్చే ఎన్నికల ముందు సీటు ఫిక్స్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.కాబట్టి భీమవరంలో పోటీ చేస్తారో లేక మరొక చోట పోటీ చేస్తారో గాని...ఇప్పుడే పవన్ సీటు ఫిక్స్ చేసుకుంటే బెటర్.