బాబు..గుడివాడపై క్లారిటీ ఇవ్వు!

M N Amaleswara rao
గతం కంటే భిన్నంగా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఉంది...ఎప్పుడు మాదిరిగా ఎన్నికలకు ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉండగానే..ఇప్పుడే అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు. అసలు గతంలో ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా సీట్లు ఖరారు చేసేవారు. రాత్రికి రాత్రి బీఫామ్‌లు ఇచ్చి పంపించి...హడావిడిగా నామినేషన్లు వేయించేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్‌కు విరుద్ధంగా బాబు వెళుతున్నారు...ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు.

ఇప్పటికే పలు సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు...అయితే కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్న గుడివాడ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్ధిని తేల్చడం లేదు..నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు టీడీపీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు...కొడాలి నాని టీడీపీని వదిలేసి వైసీపీలోకి వెళ్ళాక...గుడివాడ టీడీపీ బాధ్యతలు రావి వెంకటేశ్వరావు చూసుకుంటున్న విషయం తెలిసిందే...2014 ఎన్నికల్లో ఈయనే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..కానీ 2019 ఎన్నికల్లో ఈయనకు సీటు ఇవ్వకుండా దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి నిలబెట్టారు...ఇక అవినాష్ సైతం ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళడంతో..మళ్ళీ రావిని తీసుకొచ్చి ఇంచార్జ్‌గా పెట్టారు.

ఇంచార్జ్‌గా ఉన్నా సరే రావి పెద్దగా పనిచేయడం లేదు...గుడివాడలో ప్రజల మధ్యలో తిరగడం లేదు..దీని వల్ల ఇంకా టీడీపీకి ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి..మరి నెక్స్ట్ ఎన్నికల్లో తనకు సీటు రాదనే డౌట్‌తో రావి పనిచేయడం లేదా? ఎంత పనిచేసిన కొడాలిపై గెలవడం కష్టమని పట్టించుకోవడం లేదో తెలియడం లేదు గాని..మొత్తానికి గుడివాడలో రావి సరిగ్గా పనిచేయడం లేదు.

సరే రావి సరిగ్గా పనిచేయడం లేదని..ఆయన్ని తప్పించి వేరే నాయకుడుకు బాధ్యతలు కూడా ఇవ్వడం లేదు...పోనీ రావికి అన్నిరకాలుగా సపోర్ట్ చేసి ముందుకునెట్టడం లేదు..అసలు చంద్రబాబు..గుడివాడ విషయంలో ఏది తేల్చడం లేదు..ఇలా గుడివాడ సీటు విషయంలో బాబు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల..అక్కడ పార్టీ మరింత నష్టపోయేలా ఉంది. చూడాలి ఇకనైనా బాబు గుడివాడపై ఫోకస్ పెడతారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: