కర్మన్ ఘాట్ వద్ద ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే?

praveen
హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్నారు అన్న సమాచారం అందుకున్న హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ గో రక్షణ సమితి సభ్యులు టీకేఆర్ కమాన్ వద్ద ఒక వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలోనే ఇక ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ ఘర్షణలో ఏకంగా వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అయితే గోరక్షణ సేవా సమితి సభ్యుల పై అక్రమంగా గోవులను తరలిస్తున్న వారు దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇక గోరక్షణ సేవా సమితి సభ్యులు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇక భయంతో అక్రమంగా తరలిస్తున్న వారు  దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు.


  సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ గోరక్షణ సేవా సమితి సభ్యులు అందరూ కూడా రాత్రంత నిరసన చేపట్టడం గమనార్హం. అంతేకాకుండా తమపై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.   



 ఇటీవలే మంగళ వారం అర్ధరాత్రి సమయం లో ప్రారంభ మైన ఆందోళన తెల్లవారు జామున మూడు గంటల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఇక అటు పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంది. దీంతో ఆందోళన కారులను చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేసే పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరు తో ఆగ్రహానికి గురైన యువకులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు. తెలుస్తోంది. ఈ క్రమం లోనే  పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. దాడిచేసిన వారిని అదుపు లోకి తీసుకునేంత వరకూ ఊరుకునేది లేదని అంటూ గోరక్షణ సేవా సమితి సభ్యులుచెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: