ఆ తమ్ముళ్లని సైడ్ చేస్తున్న బాబు!

M N Amaleswara rao
ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓపిక నశించినట్లు ఉంది...ఇంకా సరిగ్గా పనిచేయని టీడీపీ నాయకులని చూస్తూ ఊరుకునేలా లేరు...వారిని వెంటనే పక్కన పెట్టడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎందుకంటే పనిచేయని నాయకుల వల్ల పార్టీకి పావలా ఉపయోగం ఉండటం లేదు...పైగా వారి వల్ల పార్టీకి అదనపు భారం..అలాగే వారి వల్ల గెలుపు అవకాశాలు ఇంకా తగ్గుతాయి. గెలుపు అవకాశాలు తగ్గి, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు.

ఇప్పుడే వైసీపీ ఒకసారి అధికారంలోకి వచ్చినందుకు టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి...ఇంకా రెండోసారి కూడా అధికారంలోకి వస్తే టీడీపీ అడ్రెస్ లేకుండా పోతుంది..అందుకే బాబు అలెర్ట్ అవుతున్నారు...అలాగే టీడీపీ నేతలని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలనే దిశగా పనిచేయడం మొదలుపెట్టారు..ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తే నెక్స్ట్ ఎన్నికలకు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు..అలా కాకుండా పనిచేయకుండా అలాగే కాలం గడిపితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది.

అదే విషయం బాబు కూడా నేతలతో చెబుతున్నారు...ఇప్పటికే ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది..మొదట్లో అంటే చాలామంది నేతలు వైసీపీకి భయపడి బయటకు రాలేదు..కానీ నిదానంగా టీడీపీ నేతలు రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు..వైసీపీ కేసులు పెట్టి జైలుకు పంపించిన సరే టీడీపీ నేతలు తగ్గట్లేదు. అలా పనిచేయడం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయింది.

కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ నేతలు ఇంకా సరిగ్గా పనిచేయడం లేదు...ఇప్పుడు అలాంటివారికి బాబు వార్నింగ్ ఇస్తున్నారు..ఇకనైనా పనిచేయడం మొదలుపెట్టకపోతే పక్కన పెట్టడానికి కూడా వెనుకాడనని చెప్పేస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలని బాబు పక్కనబెట్టేసిన విషయం తెలిసిందే...ఇక రానున్న రోజుల్లో మరి కొంతమంది నాయకులని సైడ్ చేయడానికి సిద్ధమయ్యారట...ఆ మేరకు ఒక లిస్ట్ కూడా తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పనిచేయని నాయకులని సైడ్ చేసే విషయంలో బాబు తగ్గేదేలే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: