జగన్ మేనమామకు రిస్క్ ఎక్కువేనా?
అలాగే కమలాపురం సీటు తీసుకుని 2014 ఎన్నికల్లో గెలిచారు....అదే ఊపులో 2019 ఎన్నికల్లో కూడా కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. ఇలా జగన్ మేనమామ వరుసగా సత్తా చాటుతూ వచ్చారు...మరి ఈ సారి ఎన్నికల్లో కమలాపురంలో రవీంద్రనాథ్ విజయం సాధిస్తారా? ఇప్పుడు కమలాపురంలో జగన్ మేనమామకు అనుకూల పరిస్తితులు ఉన్నాయా? అంటే అవును ఇప్పటికీ కమలాపురంలో రవీంద్రకు అనుకూలమైన పరిస్తితులే ఉన్నాయి.
ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి అంతా అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తోంది...కాకపోతే ఇక్కడ ఉన్న టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిపై సానుభూతి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది...ఎందుకంటే ఈయన గత ఎన్నికల నుంచి ఓడిపోతూనే వస్తున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2009, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అసలు కమలాపురంలో టీడీపీకి బలం పెద్దగా లేకపోయినా సరే, పార్టీని వదలకుండా పనిచేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈయనపై సానుభూతి కాస్త పెరిగింది...పైగా నెక్స్ట్ ఎన్నికలే చివరి ఛాన్స్ అన్నట్లు ముందుకెళుతున్నారు. ఇక కమలాపురం ప్రజలు కూడా ఎలాగో జగన్ మేనమామని చూశాం కదా...ఈ సారి పుత్తాకు ఛాన్స్ ఇద్దామని అనుకుంటే...ఈ సారి కమలాపురంలో జగన్ మేనమామ రిస్క్‌లో పడిపోయినట్లే అని చెప్పాలి.