బైరెడ్డి అడ్డాలో సైకిల్ లైన్‌లో పడిందా?

M N Amaleswara rao
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అనే చెప్పొచ్చు...అనేక ఏళ్ల నుంచి ఇక్కడ బైరెడ్డి ఫ్యామిలీ హవా నడుస్తూనే ఉంది...ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారినా సరే బైరెడ్డి ఫ్యామిలీ హవా తగ్గలేదు. నందికొట్కూరులో 1980 కాలంలో బైరెడ్డి శేషా శాయనరెడ్డి హవా నడిచింది..ఆ తర్వాత 1994 సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హవా సాగింది. ఇలా బైరెడ్డి ఫ్యామిలీ హవా నడుస్తుండగా, 2009లో నందికొట్కూరు ఎస్సీ రిజర్వడ్‌గా మారింది...దీంతో బైరెడ్డి ఫ్యామిలీకి పోటీ చేయడానికి కుదరలేదు. అలాగే నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టేశారు.

కానీ బైరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎప్పుడైతే సిద్ధార్థ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి..వైసీపీలో చేరారో అప్పటినుంచి నందికొట్కూరులో సీన్ మారింది...ఇప్పుడు ఆయనే నందికొట్కూరులో వైసీపీని గెలిపించే నాయకుడుగా మారారు. నందికొట్కూరులో వైసీపీ బలంగా ఉన్నా సరే సిద్ధార్థ్ బలం కూడా తొడవ్వడంతో...అక్కడ వైసీపీని ఓడించడం టీడీపీకి చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే ఆ పార్టీ చివరిగా 1999 ఎన్నికల్లో గెలిచింది...మళ్ళీ అక్కడ పార్టీ గెలవలేదు..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

అసలు బైరెడ్డి ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచేలా కనిపించడం లేదు..అయితే టీడీపీని లైన్‌లో పెట్టడానికి గౌరు వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. వెంకట రెడ్డి..గౌరు చరితా రెడ్డి భర్త అనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో గౌరు ఫ్యామిలీ కాంగ్రెస్‌లో, బైరెడ్డి ఫ్యామిలీలో పనిచేసేటప్పుడు రెండు ఫ్యామిలీలకు అసలు పడేది కాదు. 2004 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి గౌరు చరితా పోటీ చేసి టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై గెలిచారు.

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది..గౌరు ఫ్యామిలీ టీడీపీలో ఉంది. అటు బైరెడ్డి రాజశేఖర్ బీజేపీలో ఉండగా, వైసీపీలో సిద్దార్థ్ ఉన్నారు. ఇక బైరెడ్డి సిద్ధార్థ్‌కు చెక్ పెట్టాలని గౌరు వెంకటరెడ్డి చూస్తున్నారు..నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. మరి చూడాలి బైరెడ్డి అడ్డాలో సైకిల్ ఏమన్నా లైన్‌లో పడుతుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: