ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో మంచు విష్ణు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన విష్ణు..ముఖ్యమంత్రి జగన్ తో కలిసి భోజనం చేసారు.ఈమధ్య చిరంజీవి,మహేష్ బాబు,ప్రభాస్,రాజమౌళి ఇంకా కొరటాల శివ అలాగే ఆర్ నారయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు సీఎం జగన్ తో సమావేశమైన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ను మంచు విష్ణు కలవడం పై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది తమ వ్యక్తిగత భేటీ మాత్రమేనని మంచు విష్ణు తెలియజేశారు.ఈ మధ్య సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీపై స్పందిస్తూ.. ''మిస్ కమ్యూనికేషన్ వలనే నాన్నగారు మొన్న జరిగిన మీటింగ్ కు ప్రెసెంట్ కాలేకపోయారు. ఎక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందో మేమందరం కూడా మాట్లాడతాం.
ఇక పేర్నినాని గారితో మాట్లాడినప్పుడు మాకు ఆయన క్లారిటీగా దీని గురించి చెప్పారు.నాన్నగారితో పాటు మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోలకూ కూడా సి ఎం నుంచి ఆహ్వానం పంపారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అసలు అందజేయలేదు. అంతేగాని నాన్న గారిని పిలవలేదు అనేది దుష్పచారం మాత్రమే'' అని అన్నారు మంచు విష్ణు.''సీనియర్ హీరో ఇంకా లెజెండరీ యాక్టర్ అయిన నాన్నగారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఎవరు దాన్ని అందకుండా చేశారో అనే విషయం మాకు తెలుసు.ఇక అతి త్వరలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో దీని పైనా చర్చిస్తా. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్. మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. మాలో మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేమంతా కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం'' అని అన్నాడు.ఈ విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.