వామ్మో : కోర్టు బోనులో కేసీఆర్? త్వ‌ర‌లో అరెస్టు కూడా!

RATNA KISHORE
మ‌రోసారి బీజేపీ, మ‌రో సారి కేసీఆర్ కొట్టుకునేందుకు సిద్ధంగాఉన్నారు.ఇంకోవైపు చిన జియరు స్వామి కేసీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.వెయ్యి కోట్ల ఆల‌యంపై కేసీఆర్ కోపంగానే ఉన్నారు.ప్ర‌ధానిని ఆహ్వానించి స‌క‌ల మ‌ర్యాద‌లు చేసిన తీరుపై ఆగ్ర‌హంగా ఉన్నారు.త‌న‌తో విభేదిస్తున్న‌వారికి మై హోం రామేశ్వ‌ర్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చి పంపుతారు అన్న‌ది కేసీఆర్ త‌ర‌ఫున ప్ర‌శ్న‌.మ‌రోవైపు కేసీఆర్ ను కోర్టుకు లాగేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ప్ర‌య‌త్నిస్తోంది.మొన్న‌టి వేళ రాజ్యాంగం మార్చాల్సిందే అంటూ  చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే కాంగ్రెస్ తో స‌హా వివిధ ద‌ళిత సంఘాలు మండిప‌డుతూ వివిధ పోలీసు స్టేష‌న్ల‌లో త‌మ త‌ర‌ఫున ఫిర్యాదు అందించి,సంబంధిత అభ్యంత‌రాల‌ను మీడియాలో న‌మోదుచేయించిన సంగ‌తి తెలిసిందే! ఇదేవిధంగా బీజేపీ కూడా ర‌ఫెల్ వివాదంపై కేసీఆర్ అన్న మాట‌ల‌పై అభ్యంత‌రం చెబుతూ వీటిని కోర్టు ధిక్కారం కింద ప‌రిగ‌ణించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...



ఏ ముహూర్తాన స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాని వ‌చ్చారో అక్క‌డి నుంచే కొత్త కొత్త వాదాలు వినిపిస్తున్నాయి. అంతూపొంతూ లేని రీతిలో ఒక‌రినొక‌రు తిట్టుకుంటున్నారు.బీజేపీ మ‌ళ్లీ మ‌ళ్లీ కేసీఆర్ దేశ‌భ‌క్తిని సంకిస్తోంది.ఆయ‌న ఈ దేశానికి మ‌ద్ద‌తిస్తున్నారా లేదా వేరే దేశానికి ఇస్తున్నారా అంటూ మండి ప‌డుతోంది.ఇవ‌న్నీ ఎన్నిక‌ల వ‌ర‌కూ సాగనున్నాయి.ఆ త‌రువాత మ‌రి  ఉండ‌వు లేండి. అందాక వీరి కొట్లాటను చూసి విని ఆనందించ‌డం మ‌న వంతు!

ర‌ఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల‌లో అస‌లు అక్ర‌మాలే జ‌ర‌గ‌లేద‌ని సుప్రీం కోర్టు తేల్చినా, త‌మ ప్ర‌భుత్వం పై కేసీఆర్ ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని బీజేపీ బాస్ బండి సంజ‌య్ అంటున్నారు.ఇది క‌చ్చితంగా కోర్టు ధిక్క‌ర‌ణ కిందే వ‌స్తుంది అని అంటున్నారీయ‌న.తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సైతం సీన్లోకి వ‌చ్చారు.బీజేపీ పై ఆరోప‌ణ‌లు చేసి వెళ్లారు.ఇదే విధంగా కొద్ది రోజ‌లు ఈ క‌థ న‌డ‌వ‌నుంది.ముచ్చింత‌ల్ వేదిక‌గా ఆరంభం అయిన త‌గాదా చిలికి చిలికి గాలి వాన కానుంది.ఇందుకు సంబంధించి అనేక ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: