ఆ సీటు జనసేనదే?

M N Amaleswara rao
నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన పార్టీ...టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందో లేదో ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు...అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం రాజకీయంగా జనసేనకు లాభం అనే చెప్పొచ్చు...టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే జనసేనకు కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది..కాకపోతే పొత్తు ఇప్పుడే ఫిక్స్ అయ్యేలా లేదు. సరే పొత్తు గురించి పక్కనబెడితే..జనసేనకు ఒంటరిగా గెలిచే సత్తా ఉందా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి...175 సీట్లలో గట్టిగా చూస్తే ఓ 10 సీట్లలో మాత్రమే జనసేనకు బాగా బలం కనిపిస్తోంది. ఎలాగో బీజేపీతో పొత్తు ఉన్నా సరే జనసేనకు ఉపయోగం లేదనే చెప్పొచ్చు.

ఎందుకంటే బీజేపీకి ఏ మాత్రం బలం లేదు కాబట్టి...జనసేన తన సొంత బలాన్ని నమ్ముకునే ఎన్నికల బరిలో దిగాలి...సొంత బలంతో కనీసం 5 సీట్లలో పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా టీడీపీతో పొత్తు లేకుండా జనసేనకు గెలిచే అవకాశాలు ఉన్న సీట్లలో నరసాపురం అసెంబ్లీ కూడా ఒకటి. వాస్తవానికి ఇక్కడ జనసేనకు బాగా బలం ఉంది...కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం, అందులోనూ మెగా అభిమానులు ఎక్కువ ఉన్నారు..అందుకే నరసాపురంలో జనసేన స్ట్రాంగ్‌గా ఉంది.

అసలు గత ఎన్నికల్లోనే జనసేన ఇక్కడ సత్తా చాటేది...కానీ జగన్ గాలిలో కుదరలేదు...నరసాపురంలో చివరి వరకు పొరాడి..ఒక 5 వేల ఓట్ల తేడాతో వైసీపీపై ఓడిపోయింది..ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పటికీ అక్కడ వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా జనసేన ఉంది...జనసేనకే...వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉంది...ఇక్కడ టీడీపీకి పెద్దగా బలం కనిపించడం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో గాని పొత్తు ఉంటే ఈ సీటులో జనసేన డౌట్ లేకుండా గెలుస్తుంది. పొత్తు లేకపోయినా సరే..జనసేనకు సత్తా చాటే అవకాశం ఉంది. ఇంకాస్త కష్టపడితే..నరసాపురం సీటు జనసేన ఖాతాలో పడిపోతుంది..ఇందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: