పాపం బాబుని వదలడం లేదుగా?
అయినా సరే తెలంగాణ రాజకీయాల్లో కూడా బాబు పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది...ఆ మధ్య రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు పేరు బాగా వినిపించింది. రేవంత్‌కు పిసిసి పదవి బాబే ఇప్పించారని విమర్శలు వచ్చాయి. అసలు బాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోపోయినా సరే ఆయన పేరుని రాజకీయంగా బాగా వాడుతున్నారు. ఇక తాజాగా బీజేపీ నేతలు బాబుని టార్గెట్ చేశారు.
ఏపీ బీజేపీ నేతలు బాబుని టార్గెట్ చేస్తే అర్ధం ఉంది..కానీ తెలంగాణ బీజేపీ నేతలు బాబుని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న..బాబుపై విమర్శలు చేశారు....ఈ మధ్య కేసీఆర్, బీజేపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే...కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు ఇలాగే కేంద్రంపై పోరాడారు. పొరాడి బాబు ఫెయిల్ అయ్యారు..అప్పుడు బాబు దెబ్బతిన్నారు..ఇప్పుడు కేసీఆర్ దెబ్బతింటారని మల్లన్న చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడారు...దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మోదీ అవమానిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే మోదీ మాటలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అర్ధం కాలేదని, గతంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని, అలాంటి చంద్రబాబు పెంచి పోషించిన వ్యక్తే రేవంత్ రెడ్డి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కామెంట్ చేశారు. అంటే బాబుని టార్గెట్ చేస్తే రాజకీయంగా లాభం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు ఉంది. అందుకే బాబునే టార్గెట్ చేస్తున్నారు.