యూట్యూబర్‌ సరయూ విచారణ: ఏం తేల్చారు..?

Chakravarthi Kalyan
ఓ లఘుచిత్రం ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందని ఫిర్యాదు రావడంతో యూట్యూబర్, సినీనటి  సరయూను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె బృంద సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు విచారిస్తున్నారు. మొన్న ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. నిన్న రెండోరోజు కూడా విచారించారు. సరయూ, ఆమె బృందం నిర్మించిన ఓ షార్ట్ ఫిల్మ్‌ ఈ వివాదానికి కారణమైంది.


అందుకే సరయూతో పాటు ఆ షార్ట్ ఫిల్మ్‌ తీసిన దర్శకుడు, నిర్మాత అయిన బీరం శ్రీకాంత్‌రెడ్డిని కూడా విచారించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన జూనియర్‌ ఆర్టిస్టులు కృష్ణమోహన్‌ అలియాస్‌ సత్యకృష్ణ, గణపాక కార్తీక్‌లను కూడా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది.


ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్టు ఏంటి.. హిందువులను కించపరిచేలా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది.. ఇది ఉద్దేశపూర్వరకంగా జరిగిందా.. లేక.. యథాలాపంగా జరిగిందా.. అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.  హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఆషార్ట్ ఫిల్మ్ ఉందని  సరయుపై విశ్వ హిందుపరిషత్‌ వారు సరయుపై సిరిసిల్ల జిల్లాలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ షార్ట్‌ ఫిల్మ్‌పై  ముందు రాజన్న సిరిసిల్ల పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సరయు హైదరాబాద్‌లో ఉంటుంది కాబట్టి కేసునుహైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.


ఓ హోటల్ ప్రమోషన్ సాంగ్‌లో సరయు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కనిపించిందని ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన పోలీసులు విద్వేషాలు రెచ్చగొట్టేలా పాట రూపొందించారన్న అభియోగంపై సరయుపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు పెట్టారు. ఆ తర్వాత సరయును సోమవారం రాత్రి  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించడం వివాదాస్పదం అయ్యింది. చారట. దైవం బొమ్మలు ధరించి.. మద్యం సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే అర్థం వచ్చేలా ఉండటం వివాదాస్పదం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: