కర్ణాటక హిజాబ్ వివాదం: సీఎం కీలక నిర్ణయం...
అయితే ఈ వివాదం మొదలైంది ఒక కాలేజీ నుండి అన్నది తెలుస్తోంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఇంజనీరింగ్ జిల్లాలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్ ధరించడంతో ఆ యాజమాన్యం, కాలేజీ యూనిఫామ్ కు బదులుగా ఇలా హిజాబ్ ధరించడాన్ని తప్పు పట్టి క్రమశిక్షణ ఉల్లంఘన క్రింద వారిని కళాశాల నుండి పంపివేసింది. దీనితో అసలు వివాదం మొదలైంది. ఇప్పుడు అది కాస్తా పెద్ద సమస్యగా మారింది. ఈ విషయం గురించి ఈ రోజు హై కోర్ట్ లో వద్ద ప్రతివాదనలు జరిగాయి. అయితే ఇందుకోసం రాజ్యాంగం మరియు రైట్స్ అన్నింటినీ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉండడంతో హై కోర్ట్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. అయితే అంతకన్నా ముందు రాష్ట్రంలో శాంతి బద్రతలు ముఖ్యం కాబట్టి, హై కోర్ట్ అందరూ శాంతిగా సామరస్యంగా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ హిజాబ్ వివాదంపై కర్ణాటక రాష్ట్రము మొత్తం ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి విద్యాసంస్థలతో ముడిపడిన ఈ సమస్యను తగ్గించడానికి మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అంతే కాకుండా ట్విట్టర్ వేదికగా విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లితండ్రులు అందరూ కూడా శాంతియుతంగా మెలగాలని కోరారు.
అయితే ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయ సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ శాంతిబద్రతలకు భంగం కలుగకుండా ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలని సీఎం కోరారు. మరి ఈ సమస్య ఎలా ముగుస్తుందో...? హై కోర్ట్ తీర్పులో ఏమి చెప్పనుందో? అన్న కీలక విషయాలు తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.