గుడ్‌న్యూస్: ఏపీకి రూ.26 వేల కోట్ల భారీ ప్రాజెక్ట్..?
పార్లమెంట్‌లో ఏపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయం చెప్పింది. దీని గురించి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాకు తెలిపారు. విశాఖలోని రిఫైనరీ ఆధునికీకరణను కేంద్రం చేపట్టిందని.. రిఫైనరీ సామర్థ్యాన్ని ఏకంగా 15 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. హెచ్‌పీసీఎల్ చరిత్రలో ఇంతటి భారీ ప్రాజెక్టు ఇదే మొదటిసారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
అంతే కాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రాజెక్టు ముగించాలనేది లక్ష్యంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఇంధన రక్షణ, ఇంధన సంక్లిష్టత మెరుగుదల, ఇతర ప్రయోజనాలు కలుగుతాయని.. ఈ రిఫైనరీ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తోందని జీవీఎల్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
మొత్తానికి ఏపీకి బీజేపీ ఏదో చేస్తోందని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇది కొత్త విషయం కాదని.. కేంద్రం రాష్ట్రానికి ఏదో ఒరగబెడుతోందని చెప్పేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదంటున్న వైసీపీ నేతలు.. ప్రత్యేక హోదా సహా అనేక విషయాల్లో మొండి చేయి చూపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల రాజకీయ సమరం సంగతి అంటుంచి.. రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరిగినా అదే పదివేలు.