ఆహా : తిరుపతిలో హై టెన్షన్ - మంత్రి నాని ఫుల్ రిలాక్స్ ?
మరోవైపు మంత్రి పేర్ని నాని మాత్రం ఫుల్ ఖుషీగానే ఉన్నారు. చర్చలు ఫలవంతం అవుతాయి అన్న ఆశాభావంతోనే ఉన్నారు.ఇవాళ మంత్రుల కమిటీ సీఎంతో భేటీ కానున్నారు.ఈ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కొన్ని కీలక విషయాలు చెప్పారు.
ఉద్యోగులు ఎవ్వరూ సమ్మెకు వెళ్లరనే చెప్పారు. ఆ విధంగా తాము తీసుకోబోనున్న చర్యలు ఫలితాలు ఇస్తాయనే తాము భావిస్తున్నామని అన్నారు. అదేవిధంగా సమస్య ఇంత వరకూ వచ్చింది అనేందుకు సీఎస్ నో మరొకరినో బాధ్యులు చేయడం భావ్యం కాదని కూడా స్పష్టం చేశారు.దీంతో ఈ రోజు సాయంత్రానికి సమస్యపై ఓ క్లారిఫికేషన్ రావొచ్చు. ఏదేమయినా సమ్మెకు వెళ్లకుండానే ఉద్యోగుల విషయమై ఓ సానుకూల నిర్ణయం వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం జగన్. అన్నీ ఓ కొలిక్కి వస్తే స్పష్టమయిన ప్రకటనతో కూడిన పీఆర్సీ ఒకటి వెలుగులోకి రావొచ్చు.
ఇక ఉద్యోగులు కూడా ఓ మెట్టు దిగివచ్చేందుకే ఇష్టపడుతున్నారు.సమ్మె కారణంగా ఉన్న ఇజ్జత్ ను పోగొట్టుకోవద్దని కొందరు భావిస్తున్నారు.వైసీపీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలు అయితే తాము సమ్మెకు వెళ్లబోమనే అంటున్నారు.ఇదే విధంగా
కొంత వెనుకడుగు వేస్తే మేలు అని లెఫ్ట్ ఐడియాలజీతో నడిచే మిగతా సంఘాలు కూడా భావిస్తున్నాయి. చర్చలు సఫలీకృతం చేసుకుని తద్వారా కొంతలో కొంత ఆర్థిక ప్రయోజనం దక్కించుకోవడమే ఓ మధ్యే మార్గ పరిష్కారం అవుతుందని పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.హై కోర్టు కూడా సమ్మెకు సానుకూలంగా లేకపోవడంతో ఏదో ఒక విధంగా ప్రభుత్వంతో రాజీనే రాజమార్గంగా మలుచుకోవాలని చూస్తున్నారు.