ఎంఐఎం : పతంగి పార్టీ పంతం నెగ్గేనా? హై ఎల‌ర్ట్ !

RATNA KISHORE
పాత బ‌స్తీలో ఆందోళ‌నక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది.ఉత్త‌ర ప్ర‌దేశ్ లో త‌మ పార్టీ అధినేత అస‌ద్దుద్దీన్ ఓవైసీపీ పై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో అక్క‌డి ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు.దీంతో అక్క‌డ ఉద్రిక్త‌తలు త‌లెత్త‌కుండా పోలీసులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు మోహ‌రించి ఆందోళ‌న‌కారులు శాంతియుతంగా త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేయాల‌ని చెబుతున్నారు.శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు కావ‌డంతో ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ లో భ‌ద్ర‌తా సిబ్బంది ఉన్నారు.

మ‌రోవైపు ఓవైసీ సైతం కాల్పుల‌కు సంబంధించి రాజ‌కీయ కార‌ణాలేంట‌న్న‌వి చెప్ప‌లేదు.దీనిపై జాతీయ స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని మాత్రమే ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. పోలీసులు ఇప్ప‌టికే ఓ దుండగుడ్ని అరెస్టు చేశారు.ఈ నేప‌థ్యంలో ఓవైసీ అల్లా ద‌య వ‌ల్ల‌నే తాను బ‌య‌ట‌ప‌డ్డాన‌ని అంటున్నారు.లేకుంటే త‌న‌కు ప్రాణ హాని త‌ప్ప‌దు అన్నదే ఆయ‌న వాద‌న‌గా ఉంది.

ఇక బీజేపీ కానీ ఎస్పీ కానీ ఘ‌ట‌న‌ను ఖండించ‌లేదు. వాళ్ల స్టేట్మెంట్లు కూడా లేవు. ఒక‌వేళ దీని వెనుక రాజ‌కీయ హ‌స్తం ఉంటే ఓవైసీకి సానుభూతి రావ‌డం ఖాయం.అదే క‌నుక జ‌రిగితే ఓట్లు చీలిపోతాయి. ఆయ‌నిప్పుడు బీజేపీకి, ఎస్పీకి ఇద్ద‌రికీ వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు కనుక ఆ రెండు పార్టీల‌పై ఓవైసీ వ్యాఖ్య‌లు ప్ర‌భావితం చేస్తాయి.అందుకే ద‌ర్యాప్తును వేగం చేసి నిజానిజాలు బ‌య‌ట‌పెడితే బీజేసీ స‌ర్కారు స‌త్తా ఏంట‌న్న‌ది తేలిపోతుంది. యోగి ఆదిత్య నాథ్ స‌మ‌ర్థ‌త కూడా ఎంత‌న్న‌ది తేలిపోనుంది.

ఇక తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి మ‌జ్లిస్ పార్టీ అటు జ‌గ‌న్ తోనూ ఇటు కేసీఆర్ తోనూ స‌న్నిహితంగా మెలిగే పార్టీ. పైకి బీజేపీని వ్య‌తిరేకించినా కూడా ఎక్కువ సాయం అందించేది ఆ పార్టీకే అన్న‌ది ఓ లోగుట్టు. పాత‌బ‌స్తీ కేంద్రంగా రాజ‌కీయం న‌డిపే ఆ పార్టీ కొద్దిగా మ‌హారాష్ట్ర‌లోనూ మ‌రికొద్దిగా ఉత్త‌ర ప్ర‌దేశ్ లోనూ స‌త్తా చాటాల‌ని అనుకుంటోంది.ఈ విష‌య‌మై ఎప్ప‌టి నుంచో పావులు క‌దుపుతోంది.ముస్లిం ప్ర‌భావిత ప్రాంతాల‌లో స‌త్తా చాటి, త‌ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు అందుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోంది. కానీ అవి క‌ల్ల‌లుగానే మిగిలిపోయాయి. నిన్న‌టి దాడి త‌రువాత ఎంఐఎం జాత‌కం ఏ విధంగా మారనుందో అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: