షాకింగ్ : అతను లేకుంటే.. ఇక మెడికల్ షాప్ సీజ్?

praveen
కరోనా వైరస్ కాలంలో మెడికల్ షాపుల నిర్వాహకులు ఎంత లాభాలు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎంతో మంది కేవలం మందులు వాడుతూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకప్పుడు వివిధ వ్యాధులకు మందులు వాడటంలో నిర్లక్ష్యం వహించే వారు. కానీ ఇప్పుడు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలోనే ఇక మెడికల్ షాపుల నిర్వాహకులు భారీగానే లాభాలు పొందారు అనే చెప్పాలి. దీంతో ఇక కరోనా సమయంలో ఎన్నో మెడికల్ షాపులు కూడా పుట్టుకొచ్చాయి. ఎక్కడ చూసినా ఎక్కువగానే మెడికల్ షాపులు దర్శనమిస్తున్నాయి.
 అంతా బాగానే ఉంది కానీ మెడికల్ షాప్స్ ప్రారంభించాలి అంటే తప్పనిసరిగా ఒక ఫార్మసిస్ట్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ఫార్మసిస్ట్ షాప్ లో ఉంటూ మందులు విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మెడికల్ షాప్ లలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. లైసెన్స్ తీసుకోవడం వరకే మా పని అన్నట్లుగా ఫార్మసిస్ట్ లు వ్యవహరిస్తున్నారు. ఇక ఆ తర్వాత అనుభవములేని ఎవరో ఒకరిని ఉద్యోగంలో చేర్చుకుంటూ ఇక వారి ద్వారానే మందులు విక్రయించడం లాంటివి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఎన్నో మెడికల్ షాపులు ఫార్మసిస్ట్ లేకుండానే నడుస్తున్నాయి.

 అయితే ఇది నిబంధనలకు విరుద్ధం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్మాసిస్ట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల పై చర్యలకు ఉపక్రమించింది. ఇకనుంచి ఫార్మసిస్టు లేకుండా మెడికల్ షాపులు నడిస్తే వాటిని వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ నెలకు కనీసం 25 షాపులను తనిఖీ చేసి ఇక నివేదికను ప్రత్యేకమైన యాప్ ద్వారా రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలికి పంపాలంటూ సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎంతోమంది ఫార్మసిస్ట్లకు షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: