అలర్ట్.. వెంటనే ఈ యాప్ డిలీట్ చేయండి?

praveen
ఇటీవలి కాలంలో మొబైల్స్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మొబైల్ చేతిలో మాత్రం ఉండాల్సిందే. అర క్షణం పాటు చేతిలో మొబైల్ లేకపోయినా గంటసేపు బాధపడిపోతూ ఉన్నారు నేటి రోజుల్లో జనాలు.. అంతలా మొబైల్ కి బానిసలుగా మారిపోయారు అందరు. ఇక మొబైల్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో అటు ఎన్నో రకాల యాప్స్ కూడా అందుబాటులోకి వస్తు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది మొబైల్ వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్స్ వినియోగంపై ఆధారపడి పోతున్నారు.



 అయితే థర్డ్ పార్టీ యాప్స్ వాడటం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి అంటూ అటు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ.. ఒకవైపు రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నప్పటికి మొబైల్ వినియోగదారులు మాత్రమే థర్డ్ పార్టీ యాప్స్ వినియోగించడంలో ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం వాట్సాప్ లో ఎన్నో మెసేజ్లను ఎవరికీ కనిపించకుండా డిలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది.. అయితే ఒక వ్యక్తి మెసేజ్ పంపించి ఆ తర్వాత డిలీట్ చేశాక ఇక ఆ మెసేజ్ లో ఏం ఉండి ఉంటుందా అని అందరిలో ఆతృత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలోనే ఆ మెసేజ్ ను చూసేందుకు థర్డ్ పార్టీ యాప్లను వినియోగిస్తున్నారు.


 ఇలా ప్లే స్టోర్,యాప్ స్టోర్ నుంచి యాప్స్ ఇంస్టాల్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఇక ఇలాంటి వాటిలో WAMR ఫేమస్ అనే యాప్ కూడా ఉంది. ఈ యాప్ కనుక ఒకవేళ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయడం ఎంతో బెటర్. ఎందుకంటే వ్యక్తిగత సమాచారం మొత్తం ఈ యాప్ సర్వర్లలో  నిక్షిప్తమవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అందుకే మొబైల్ నుంచి ఈ యాప్ వెంటనే డిలీట్ చేయాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ యాప్ ను 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: