ఆ రేట్లు భారీగా పెంచేసిన కేసీఆర్.. ఇక ఖజానా కళకళ..?
అమల్లోకి వచ్చాయి. అయితే.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి మాత్రం కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి మాత్రమే పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం.
ఇక భూముల విలువలు ఎంతెంత పెరిగాయంటే.. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు ఏకంగా 50 శాతం పెరిగాయి. అంటే గతంలో ఎకరం 10 లక్షలు ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 15లక్షలు అయ్యిందన్నమాట. ఆ తర్వాత ఖాళీ స్థలాల విలువ 35 శాతం పెరిగింది. ఫ్లాట్ల విలువ 25 శాతం వరకూ పెరిగింది. ఈ పెరిగిన విలువలకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. భూములకు బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 5 నుంచి 10 శాతం విలువ పెంచేశారు.
ఈ పెరిగిన కొత్త విలువలతో రాష్ట్రంలో తెలంగాణలో తొలిసారి ఖాళీ స్థలం విలువ గజం లక్ష రూపాయలు దాటేసింది. అలాగే ఫ్లాట్ చదరపు అడుగు విలువ రూ.9 వేలు దాటింది. పాత మార్కెట్ విలువలతో రిజిస్ట్రేషన్లకు నిన్నటితో గడువు ముగిసింది. చివరి రోజైన నిన్న అర్థరాత్రి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. విలువలు పెరుగుతాయని ముందుగా వార్తలు రావడంతో జనం చివరి రోజుల్లో రిజిస్ట్రేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఒక్క జనవరిలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.1200 కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.
ఇక పెరిగిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిగేలా రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. ఇవాళ్టి నుంచి తెలంగాణలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరింత ఆదాయం రానుంది.