రష్యాలో వింత సమస్య.. భారీగా తగ్గుతున్న జనాభా..?

Chakravarthi Kalyan
ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలు.. ఇది 1980-90లలో వినిపించిన జనాభా నియంత్రణ నినాదం.. ఆ తర్వాత సీన్ మరింత మారింది.. మేమిద్దరం.. మాకిద్దరు.. అనే నినాదం వచ్చింది. అయినా ఇండియాలో జనాభా మాత్రం తగ్గలేదు. ఏటికేడు పెరుగుతూనే ఉంది. కానీ.. రష్యా, చైనా, జపాన్ వంటి సంపన్న దేశాలు మాత్రం జనాభా సమస్యతో బాధపడుతున్నాయి. అంటే జనాభా ఎక్కువై కాదు.. జనాభా తక్కువై బాధపడుతున్నాయి. ఎందుకంటే.. ఇక్కడ మరణాలు రేటు జననాల రేటు కంటే ఎక్కువగా ఉంటోందట.


అందువల్ల రష్యాలో జనాభా ఏటికేడు క్రమంగా తగ్గిపోతోందట. గతంలోనే ఈ ట్రెండ్ మొదలైనా..  కొవిడ్‌ విజృంభణ వంటి కారణాలతో దేశ జనాభా భారీగా పడిపోతోందట. కరోనా కారణంగా ఏకంగా పది లక్షల కంటే ఎక్కువ మంది తగ్గిపోయినట్లు రష్యా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రష్యా పూర్వరూపమైన సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ స్థాయిలో జనాభా తగ్గిపోవడం ఇదే మొట్టమొదటిసారి అని చెబుతున్నారు. ఇలా నమోదు  ఇంతగా నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్ అట.


కొవిడ్‌ బారినపడే దాదాపు 7 లక్షల మంది తుడిచిపెట్టుకుపోయారు. అయితే రష్యాలో ఇలా జనాభా తగ్గడం ఇదే మొదటి సారి కాదు.. 2020లోనూ రష్యా జనాభా 5 లక్షలకు పైగా తగ్గిపోయిందట. అయితే.. ఈ ఏడాది ఈ రేటు ఇంకాస్త పెరిగింది. ఈ ఏడాది రష్యా జనాభా మరో పది లక్షలు తగ్గిపోయింది.


ఇక్కడి ప్రభుత్వం జనాభా వృద్ధి కోసం మహిళలకు  కనిష్ఠ సంతానోత్పత్తి రేటును 2.1గా నిర్ణయించింది. అయితే.. ప్రస్తుతం ఇది 1.5గా మాత్రమే ఉందట. 1990 లలోనే జననాల రేటు పడిపోయిందట. అప్పుడు పుట్టినవారు ఇప్పుడు తల్లిదండ్రులుగా మారుతున్నారట. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు కొందరు అయితే జనాభా పెంచడంపై పుతిన్ ప్రత్యేకంగా దృష్టి సారించారట. రష్యాకు  14.6 కోట్ల మంది జనాభా సరిపోరని, కార్మిక శక్తికి కొరత ఏర్పడుతోందని ఆయన అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: