వావ్ : జయము చంద్రబాబుకు! జేజేలు జగనన్నకు!
అది కూడా నిజమో కాదో తేల్చాలి.ఏదేమయినప్పటికీ జగన్ దారి వేరు, చంద్రబాబు దారి వేరు.రాష్ట్రం అభివృద్ధిలో ఎవరి వాటా ఎంతన్నది ఆలోచిస్తే ఇప్పటిదాకా జగన్ చేసిన అభివృద్ధి పెద్దగా లేదనే తేలిపోయింది. ఆ విధంగా చంద్రబాబుకు జేజేలు..అభినందనలు కూడా! ఇక సంక్షేమ పథకాల అమలుకు వస్తే చంద్రబాబు కన్నా జగన్ బాగున్నారు. బాగా ముందున్నారు కూడా! ఆ విధంగా జగన్ కు జేజేలు,చప్పట్లు కూడా! ఏం చేసినా చేయకున్నా సంక్షేమంకు మాత్రం డబ్బులు అప్పులు తెస్తున్న విధానమే అత్యంత అవమానకరంగా ఉంది.
ఇక పాలనా సంబంధ విషయాల్లో చంద్రబాబు కన్నా జగన్ కొంత పరిణితితో ఉన్నారు.ముఖ్యంగా గ్రామ స్థాయిలో సచివాలయాల ఏర్పాటు,నిర్వహణ అన్న కాన్సెప్టులు బాగున్నాయి.అంతేకాదు వలంటీరు వ్యవస్థకు కూడా మంచి మార్కులే వచ్చాయి.ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధానం వర్తింపజేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.అంతేకాదు సచివాలయాల ఏర్పాటు మరింత సక్సెస్ అయితే పౌరులకు ఇక సమస్యలన్నవి త్వరితగతిన పరిష్కారం కావడం కూడా ఖాయం. ఆవిధంగా జగన్ ముందున్నారు చంద్రబాబు కన్నా!
అధికారులను పరుగులు తీయించడంలో జగన్ కన్నా చంద్రబాబుకే జేజేలు. ఏమన్నా అనండి ఎడ్మిన్ పరంగా చంద్రబాబు టాప్.మిగిలిన విషయాల్లో చంద్రబాబే బాగుంటారు జగన్ కన్నా ! అని అనేందుకు ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేపట్టిన పనులే మరియు ఉద్యోగుల విషయమై తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణలు. ఆ విధంగా చంద్రబాబు గ్రేట్.ఆఖరుగా కొత్త జిల్లాల ఏర్పాటు ఆ రోజు చంద్రబాబు వల్ల కాలేదు.ఇవాళ ఓ ప్రకటన అయినా సరే! స్పష్టంగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆ విధంగా జగన్ కు జేజేలు.