జగనన్న.. గిట్ల చేసుడేంది.. బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్షం?

praveen
ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త జిల్లాలు ప్రకటించింది. అయితే ఈ కొత్త జిల్లాల ప్రకటన గా సంచలనంగా మారిపోయింది. ఇక ఎన్నో నియోజక వర్గాలను కూడా జిల్లాలుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. అయితే ఇక జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక ఎన్నో ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతం జిల్లాగా అవతరించడం తో జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మరికొంతమంది మాత్రం తమ ప్రాంతాన్ని ఎందుకు జిల్లాగా మార్చలేదు అంటూ జగన్ సర్కార్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.


 ఈ క్రమంలోనే హిందూపురమును జిల్లా కేంద్రంగా ఎందుకు మార్చలేదు అంటూ గత కొన్ని రోజుల నుంచి అఖిలపక్షం జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. హిందూపురం ని జిల్లా కేంద్రంగా మార్చకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అఖిలపక్షం హెచ్చరికలు జారీ చేస్తుండడం గమనార్హం.  ఈ క్రమంలోనే ఇదే విషయంపై అఖిలపక్షం నేడు బంద్కు పిలుపునిచ్చింది. ఇక అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో  వాణిజ్య సముదాయాలు కూడా మద్దతు పలకడం గమనార్హం. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


 అయితే జగన్ ప్రభుత్వం వెంటనే హిందూపురం నియోజకవర్గం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అంటూ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అనే విషయం తెలిసిందే. అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా అనంతపురం జిల్లాలను రెండు జిల్లాలు గా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అటు హిందూపురం నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై ఆ ప్రాంత వాసులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: