చిన్న జిల్లాలు టీడీపీకే ప్లస్ అవుతాయా?

M N Amaleswara rao
మొన్నటివరకు నియోజకవర్గాల పరంగా చూసుకుంటే....తూర్పు గోదావరి పెద్ద జిల్లా...విజయనగరం చిన్న జిల్లా. తూర్పులో మొత్తం 19 స్థానాలు ఉండగా, విజయనగరంలో 9 స్థానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది...13 జిల్లాలని పార్లమెంట్ స్థానాల వారీగా విడగొట్టింది. అంటే 25 జిల్లాలు అవుతాయి...కాకపోతే అరకు పెద్దగా ఉండటంతో, దాన్ని రెండు జిల్లాలు చేశారు..దీంతో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి.

అయితే అసెంబ్లీ స్థానాల వారీగా చూసుకుంటే ఇప్పుడు అన్నీ జిల్లాలు దాదాపు సమానమే...మెజారిటీ జిల్లాల్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని జిల్లాల్లో 8 స్థానాలు, కొన్ని జిల్లాల్లో 6 స్థానాలు ఉన్నాయి. ఇక అరకుని రెండు జిల్లాలుగా విడగొట్టడంతో ఒక జిల్లా ఏమో నాలుగు, ఒక జిల్లా ఏమో మూడు స్థానాలతో ఉంది. అంటే మూడు స్థానాలు ఉన్న జిల్లా..అతి చిన్న జిల్లా. పాడేరు కేంద్రంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా చాలా చిన్నది. ఇందులో పాడేరు, రంపచోడవరం, అరకు స్థానాలు ఉంటాయి.  అటు పార్వతీపురం కేంద్రంగా ఏర్పడిన మన్యం జిల్లాల్లో...పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఉన్నాయి.


ఇక తర్వాత విశాఖపట్నంలో ఆరు స్థానాలు..బాపట్ల, నంద్యాల, హిందూపురం(సత్యసాయి) జిల్లాలు కూడా ఆరు స్థానాలతోనే ఉన్నాయి. ఇలా తక్కువ స్థానాలతో ఏర్పడిన జిల్లాల్లో వైసీపీదే హవా ఉంది. కాకపోతే కొన్ని జిల్లాల్లో ఇప్పుడు టీడీపీ లీడ్ పెరుగుతుంది. విశాఖ, బాపట్ల, సత్యసాయి జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యం కనిపిస్తోంది.

ఈ మూడు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం పెరిగినట్లు కనిపిస్తోంది. అటు ఏజెన్సీ జిల్లాల్లో కూడా టీడీపీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నంద్యాల జిల్లా ఇంకా వైసీపీ వైపే ఉంది...ఈ జిల్లాల వైసీపీ లీడ్ ఇంకా తగ్గలేదు. అలాగే ఏజెన్సీ జిల్లాల్లో వైసీపీకి ఇంకా పట్టు ఉంది.  కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చు. మొత్తానికైతే చిన్న జిల్లాల్లో కాస్త టీడీపీ కి ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: